Peddi Sudarshan Reddy: చనిపోతే ప్రజల మనిషి కాదా.. పెద్ది సుదర్శన్ విగ్రహం తొలగింపుపై భార్య కన్నీటి ఆవేదన | తెలంగాణ వార్తలు | ACTPnews

Peddi Sudarshan Reddy


Last Updated:

Peddi Sudarshan Reddy: ప్రజల మనిషిగా పేరు సంపాదించుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయడానికి గద్దె నిర్మిస్తే మున్సిపల్ అధికారులు అనుమతి లేదంటూ గద్దెను ధ్వంసం చేశారు. విగ్రహం ఏర్పాటును అడ్డుకున్నారు. ఈవిషయం తెలిసి నల్లబెల్లిలోని ఆయన స్వగృహం వద్ద విషాద వాతావరణం నెలకొంది.

Peddi Sudarshan Reddy
Peddi Sudarshan Reddy

Telangana Politics: రాజకీయాల్లో పోటీ తత్వం కాస్తా ఇప్పుడు అధిపత్య ధోరణిగా మారింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల పార్టీ నేతలదే స్థానికంగా పెత్తనం చేలాయించే రోజులు వచ్చేశాయి. గతంలో ఎక్కడైనా ప్రజాప్రతినిధి అకస్మాత్తుగా మరణిస్తే అతని పేరుతో అభిమానులు సొంత నియోజకవర్గంలో విగ్రహాలు పెట్టుకునే సంప్రదాయం ఉండేది. అయితే ఈవిగ్రహాలు నెలకోల్పే సంప్రదాయం ఇప్పుడు మారిపోయింది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు, అభిమానులతో పాటు స్థానికుల్ని తీవ్రంగా బాధించింది. ప్రజల మనిషిగా పేరు సంపాదించుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేయడానికి గద్దె నిర్మిస్తే మున్సిపల్ అధికారులు అనుమతి లేదంటూ గద్దెను ధ్వంసం చేశారు. విగ్రహం ఏర్పాటును అడ్డుకున్నారు. ఈవిషయం తెలిసి నల్లబెల్లిలోని ఆయన స్వగృహం వద్ద విషాద వాతావరణం నెలకొంది. సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న విగ్రహం వద్ద రోదిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ పాలకుల్ని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని మండిపడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed