Peddi Trailer: పెద్ది ట్రైలర్ రివ్యూ ఇచ్చేసిన చిరంజీవి.. మెగా అభిమానులకు పూనకాలే ఇక | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా పెద్ది. మే 18న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ కానుండగా.. రెండు రోజుల ముందే చిరంజీవి ఈ ట్రైలర్ రివ్యూ ఇచ్చేశారు.

News18
News18

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ రా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. మే 18న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సర్వం సిద్ధం చేశారు. అయితే, ఈ అఫీషియల్ రిలీజ్‌ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రైలర్‌ను వీక్షించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. ఇది మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది.

ట్రైలర్ చూసిన అనంతరం చిరంజీవి ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ.. చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. “ఇప్పుడే ‘పెద్ది’ ట్రైలర్ చూశాను.. జస్ట్ వావ్ అంతే! 3 నిమిషాల పాటు సాగిన ఈ విజువల్ ట్రీట్ ప్యూర్ పవర్ ప్యాక్డ్‌గా ఉంది. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. అందరూ కలిసి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించడం ఖాయం. ఈ సినిమాపై మనం ఎంత ఊహించుకున్నా, ఈ ట్రైలర్ దాన్ని మించి ఉంటుంది. ఇందులో ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి” అంటూ కొనియాడారు.

మరోసారి ‘చిరు లీక్స్’..

తన సినిమాలకు లేదా చరణ్ సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ముందే లీక్ చేసి అభిమానులను ఖుషీ చేయడం మెగాస్టార్‌కు అలవాటు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ సినిమాల విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు ‘పెద్ది’ వంతు వచ్చింది. “చాలా రోజులయింది కదా మీకు ‘చిరు లీక్స్’ ఇచ్చి..” అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తూ, ట్రైలర్‌లోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను ఆయన లీక్ చేశారు. “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సారు..” అనే డైలాగ్ థియేటర్లలో పేలిపోతుందని చిరు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ బుచ్చిబాబుకు క్షమాపణలు చెబుతూ.. “సారీ బుచ్చిబాబు.. ట్రైలర్ చూశాక కంట్రోల్ తప్పి లీక్ చేయాల్సి వచ్చింది” అంటూ చమత్కరించారు.

‘ఉప్పెన’ వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ తర్వాత ఆ స్థాయి పల్లెటూరి ఇంటెన్స్ రోల్ ఇదేనని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ‘గౌరనాయుడు’ అనే పవర్‌ఫుల్ రెజిల్ కోచ్ పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకూమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మెగాస్టార్ ఇచ్చిన లీక్ అండ్ రివ్యూతో మే 18న రాబోయే అఫీషియల్ ట్రైలర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports