Pithapuram Politics: మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ ఝలక్..! ఫిఠాపురం కింగ్ రియాక్షన్ ఇదే | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics) | ACTPnews

Pithapuram


Last Updated:

Pithapuram Politics: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్మకు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్కో పదవి పోగొట్టుకుంటున్న వర్మకు ఈసారి ఆ బాధ్యతల నుండి కూడా తొలగించింది పార్టీ హైకమాండ్.

+

Pithapuram Politics

Pithapuram Politics: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్మకు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్‌చార్జీగా కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ హైకమాండ్ ఉన్నపళంగా ఆయన్ని ఆ బాధ్యతల నుండి తప్పించింది. నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా వర్మకు జనసేన నేతలకు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు, చేస్తున్న కామెంట్స్, కూటమి పార్టీలపై వస్తున్న విమర్శలకు సమాధానంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలు మరొకరికి అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో పార్టీని నమ్ముకుని తన ఎమ్మెల్యే పదవి సైతం త్యాగం చేసి ముందుకు వెళుతున్న వర్మ పరిస్థితి ప్రశ్నార్థకమైందంటూ పలువురు గుసగుసలాడుతున్నారు. అసలు పిఠాపురంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురించింది..? జరిగిన గొడవలే దీనికి కారణమా, లేక ఇదంతా టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అనుకోవచ్చా.. ఫుల్ లెంగ్త్ స్టోరీ చూద్దాం.

ఇన్‌ఛార్జ్ బాధ్యతలు ఊస్ట్..!

జనసేన తెలుగుదేశం కార్యకర్తలు, నేతల మధ్య ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. తాజాగా పిఠాపురం పట్టణంలో ఒక ప్రారంభోత్సవానికి సంబంధించి బ్యానర్లో ముఖ్యమంత్రి ఫోటో లేదని వర్మ అక్కడున్న వారిని నిలదీశారు. ఇలాంటి తరుణంలో జనసేన తెలుగుదేశం పార్టీ నేతల మధ్య తోపులాట సైతం సంభవించింది. ఒకరిపై ఒకరు తిట్ల దండకం అందుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు తూపులాటకు దిగిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం కాస్త అధిష్టానం దృష్టికి సైతం వెళ్లిందని చెప్పుకోవచ్చు. అయితే వర్మ ప్రతి విషయంలో కాంప్రమైజ్ కాకుండా కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం అందుతుంది.

నెక్స్ట్ ఏంటీ..?

ఇలాంటి తరుణంలో పిఠాపురం నియోజకవర్గ బాధ్యత నుంచి వర్మను తొలగిస్తూ అధిష్టానం ప్రత్యేక లేఖను విడుదల చేసినట్లుగా సమాచారం అందుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వర్మ ఉంటున్నారని చంద్రబాబు తొలగించారంటూ పలువురు గుసగుసలాడుతున్నారు . నిజానికి చంద్రబాబుకు అత్యంత శిష్యుడిగా సైతం వర్మ ఉంటారని చెప్పుకోవచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ సీటు వర్మకు ఇవ్వలేనప్పటికీ ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి మళ్లీ టిడిపిలోకి వెళ్లిన పరిస్థితి ఉంది. ఇలా తెలుగుదేశం పార్టీతో వర్మకు విడదీయరాన్ని అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం వర్మను ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించడం వెనక పెద్ద స్కెచ్ ఉంటుందంటూ ఇంకొందరు వారి ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఏదేమైనా జరిగిన పరిణామాల తర్వాత ఈ విషయంలో వర్మ , వర్మ అనుచరులు ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports