PM Modi: ఈ రికార్డు ఎన్టీయే కార్యకర్తలకు అంకితం.. ప్రజలే తనకు దేవుళ్లన్న ప్రధాని మోదీ! | | ACTPnews

PM Modi: ఈ రికార్డు ఎన్టీయే కార్యకర్తలకు అంకితం.. ప్రజలే తనకు దేవుళ్లన్న ప్రధాని మోదీ! |


“నాకు అభినందనలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. నా జీవితంలో ఇది అద్భుత క్షణం. ప్రజలే నాకు దేవుళ్లు. మన ఎన్డీయేలోని ప్రతీ కార్యకర్తకూ నా రికార్డును అంకితం చేస్తున్నా. భారత ప్రజల నిరంతర వివేకం అద్భుతం. వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు” అని మోదీ అన్నారు.

“2014కి ముందు కొన్ని దశాబ్దాలపాటూ చాలా అస్థిరత ఉంది. అది దేశానికి అనేక కష్టాలు తెచ్చింది. ఇప్పుడు దేశ ప్రజలు ఒక స్థిరమైన ప్రభుత్వ కాంబినేషన్ చూస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపట్ల ప్రశంసిస్తున్నారు. దేశ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నాను” అని మోదీ చెప్పారు.

“ఈ 12 ఏళ్లలో 25 కోట్ల మందికి పైగా పేదల్ని.. పేదరిక రేఖ నుంచి పైకి తీసుకొచ్చాం. ఒక రోజు వారి స్వప్నాలన్నీ నిజం అవుతాయి. నిన్నటి పేదలు.. నేడు న్యూ మిడిల్ క్లాస్ అవుతున్నారు. వారిని మనం వెనక్కి ఉంచం. వారిని ముందుకు తీసుకువచ్చేందుకు.. రేయింబవళ్లు కష్టపడతాం. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను పూర్తి చెయ్యాలి. యువత, మహిళలు, మధ్య తరగతి ప్రజలు, రైతుల ఆకాంక్షలు, ఆశలను మనం పూర్తి చెయ్యాలి” అని మోదీ సూచించారు.

“దేశ ప్రజలందరి వికసిత భారత్ స్వప్నాన్ని పూర్తి చెయ్యాలి. అది అందరి సంకల్పం. దాన్ని పూర్తి చెయ్యడానికి మనల్ని మనం నిరంతరం సమర్పించుకోవాలి. ఎన్డీయే 12 ఏళ్లలో ఇదే చేసింది. కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తిని చేస్తోంది. కాంగ్రెస్ దేశాన్ని నాశనం చేసింది. మనం దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. భారతీయుల గ్రోత్ రేట్ పెరగాలి. కాంగ్రెస్ గ్రోత్ రేట్ తగ్గాలి. కాంగ్రెస్‌లో పాలనలేదు, నీతి లేదు, నిర్ణయాలు లేవు” అని మోదీ అన్నారు.

“ఇదివరకు అటల్ జీ నేతృత్వంలో ప్రభుత్వం వచ్చాక అభివృద్ధిని తీసుకొచ్చాం. కానీ 2014లో మళ్లీ కాంగ్రెస్ వచ్చింది, అభివృద్ధి దూరమైపోయింది. కాంగ్రెస్ వల్ల వేల కోట్ల అవినితి జరిగింది. దేశాన్ని ముందుకు నడిపించేందుకు 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది” అని మోదీ తెలిపారు.

“దేశం చూస్తోంది.. నీతి, నియమబద్ధమైన పాలన, మంచి నిర్ణయాలను చూస్తోంది. అభివృద్ధి జరుగుతోంది. 2014 నాటికీ, ఇప్పటికీ చాలా మారింది. ఎయిర్‌పోర్టులు, ఎక్స్‌ప్రెస్ వేలు, మెట్రోలు పెరిగాయి. అప్పట్లో రక్షణ రంగానికి చాలా తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ కేటాయిస్తున్నాం. 2014లో దేశంలో 25 కోట్ల మంది ఇంటర్నెట్ వాడేవారు.. ఇప్పుడు 100 కోట్ల మందికి పైగా వాడుతున్నారు. అప్పట్లో డిజిటల్ పేమెంట్స్ లేవు, ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ మనం. సోలార్ పవర్ లోనూ 150కి పైగా గిగావాట్లతో దూసుకెళ్తున్నాం. అప్పట్లో ఇథనాల్ బ్లెండింగ్ లేదు.. ఇప్పుడు 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ ఉంది. సెమీ కండక్టర్లు కూడా ఉన్నాయి” అని మోదీ తెలిపారు.

ఇవి కూడా చదవండి: Silver Rate today: వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? పెట్టుబడికి ఇది సరైన టైమేనా?

“యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ శాఖను ఏర్పాటు చేశాం. దివ్యాంగుల కోసం చట్టం, ఆదివాసీల కోసం చట్టాలు తెచ్చాం. టూరిజం, స్పోర్ట్స్ రంగాల్లో భారత్ దూసుకెళ్లాలి. ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. స్పోర్ట్స్ లోనూ భారత్ అద్భుత ప్రదర్శన ఇవ్వాలి. మున్ముందు మనం ఒలంపిక్స్‌కి కూడా తయారవుతుంది. మనం చిన్నగా ఆలోచించకూడదు. మన లక్షం పైకి ఉండాలి. పెద్దగా ఉండాలి. ఇప్పుడు భారత్.. సంస్కరణల్లో దూసుకెళ్తోంది. దేశం నిరంతరం.. సంస్కరణలను సపోర్ట్ చేస్తోంది. ఈ 12 సంవత్సరాలు ఉత్సవంలా సాగించింది. దేశ ప్రజల మనసును గెలుచుకున్నాం. ప్రపంచ దేశాలు దెబ్బతిన్నా.. భారత్ నిలదొక్కుకుంది. ప్రజలు ఎప్పటికీ నిరాశ చెందకుండా చేస్తాం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ మన మంత్రం. అందరి అభివృద్ధే.. దేశ అభివృద్ధి. సమయం ఆసన్నమైంది. రాష్ట్రాల మధ్య విబేధాలు ఉండకూడదు. అప్పుడే ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమవుతుంది. అప్పుడే ఇన్నోవేషన్లు సాధ్యమవుతాయి. అప్పుడే ఉద్యోగాల కల్పన జరుగుతుంది. రాష్ట్రాల ప్రగతే, దేశ ప్రగతి. విబేధాలను పక్కన పెడతాం. కలిసి ముందుకు సాగుదాం. మున్ముందు మరిన్ని సాధిద్దాం. నాకు నమ్మకం ఉంది. మరోసారి అందరికీ అంతఃకరణ పూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. వారే నాకు శక్తి, ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తున్నారు” అని మోదీ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *