Last Updated:
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో పాటు తన ప్రసంగంలో ఆయన ప్రధానంగా ప్రస్తావించిన 10 కీలక అంశాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి 13వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో దేశం సాధించిన ప్రగతి, భవిష్యత్ లక్ష్యాలను ఆయన స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా (వికసిత్ భారత్) మారాలనే లక్ష్యాన్ని దేశ ప్రజల ముందు ఉంచారు. ఒకప్పుడు ఆర్థికంగా వెనుకబడిన దేశాల జాబితాలో ఉన్న భారత్, నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎదిగిందని ప్రధాని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రతి భారతీయుడు చిన్న కలలు కనడం మాని, పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.














