PM Modi’s Australia Visit: త్వరలో 6జీ సేవలు తీసుకురాబోతున్నాం.. 3వ ఆర్థిక వ్యవస్థకు అడుగు దూరంలో ఉన్నాం: ప్రధాని మోదీ | | ACTPnews

PM Modi's Australia Visit: త్వరలో 6జీ సేవలు తీసుకురాబోతున్నాం.. 3వ ఆర్థిక వ్యవస్థకు అడుగు దూరంలో ఉన్నాం: ప్రధాని మోదీ |


గురువారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు గత కొన్నేళ్లలో ఎంతగా బలోపేతమయ్యాయో వివరించారు. తాను 2014లో తొలిసారి ఆస్ట్రేలియా పర్యటించిన విషయాన్ని గుర్తుచేస్తూ, అది 28 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధాని చేసిన తొలి ఆస్ట్రేలియా పర్యటన అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు తాను మూడుసార్లు ఆస్ట్రేలియాను సందర్శించానని, ఇది తనకు ఒక “హ్యాట్రిక్” లాంటిదని మోదీ అన్నారు. ఈ మూడు పర్యటనలు భారత్-ఆస్ట్రేలియా మధ్య మరింత బలపడుతున్న ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

గత 12 ఏళ్లలో దేశ మెట్రో నెట్‌వర్క్ రెండు డజన్లకు పైగా నగరాలకు విస్తరించిందని, దీనితో ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ మౌలిక సదుపాయాల వృద్ధిని ప్రదర్శించారు. మెల్బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో ప్రతిరోజూ 12.5 మిలియన్లకు పైగా ప్రజలు మెట్రోలో ప్రయాణిస్తారని అన్నారు. నమో భారత్ రాపిడ్ రైల్, వందే భారత్ రైళ్ల వంటి ప్రాజెక్టుల ద్వారా భారతదేశం తన సెమీ-హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను కూడా వేగంగా విస్తరిస్తోందని, ఇది ఆధునిక రవాణా మౌలిక సదుపాయాల కోసం దేశం చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. అతి త్వరలో భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, అలాగే దేశంలో 6జీ సేవలు కూడా తీసుకురాబోతున్నట్లు ప్రకటించాడు.

త 12 ఏళ్లలో ‘మేక్ ఇన్ ఇండియా’ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా రూపుదిద్దుకుంది. మన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు చేరుకున్నాయి. మన ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని విస్తరించుకున్నాయి” అని అన్నారు.

భారత తయారీ రంగానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, ఆవిష్కరణలు, ఉత్పత్తి మరియు ఎగుమతులకు దేశం ఒక విశ్వసనీయ కేంద్రంగా ఆవిర్భవించడాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. భారతదేశంలో పెరుగుతున్న రక్షణ సామర్థ్యాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా వేదికగా ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ సైనిక బలం ప్రదర్శించబడిందని, దాని ప్రభావం లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద శిబిరాలకు మించి విస్తరించిందని ఆయన అన్నారు. ఆస్ట్రేలియా ప్రపంచ క్రీడా శక్తి అని, అదే సమయంలో భారతదేశం కూడా క్రీడా మౌలిక సదుపాయాలు, ప్రతిభ అభివృద్ధిలో ఒక పెద్ద మార్పు వస్తుందని అన్నారు.

మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం

మెల్‌బోర్న్‌లో భారతీయ సమాజం ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికింది. భారీ సంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన మోదీ, ఈ కార్యక్రమాన్ని “హౌస్‌ఫుల్”, “బ్లాక్‌బస్టర్”గా అభివర్ణించారు.

తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, ఆ ప్రాంతపు సాంప్రదాయ యజమానులను (Traditional Owners) గుర్తు చేసుకుని, వారి పెద్దలకు (Elders) గౌరవం తెలిపారు. గత పర్యటనల్లో సిడ్నీలో ప్రవాస భారతీయులతో సమావేశమైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, మెల్‌బోర్న్‌లోని భారతీయులను కూడా కలవాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.

“ఈ కార్యక్రమం హౌస్‌ఫుల్‌గా ఉంది. ఇది ఒక బ్లాక్‌బస్టర్. ఇంతకుముందు నేను సిడ్నీలో మీ అందరినీ రెండుసార్లు కలిశాను. మెల్‌బోర్న్ ప్రజలను కూడా కలవాలని ఎంతోకాలంగా అనుకుంటున్నాను. అందుకే ఈసారి మెల్‌బోర్న్ ప్రజలతో కలిసి ఒక ‘ఫ్లాట్ వైట్ కాఫీ’ తాగాలని నిర్ణయించుకున్నాను” అని ప్రధాని మోదీ చెప్పగా, సభలో ఉన్నవారు ఘనంగా చప్పట్లతో స్వాగతించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed