Last Updated:
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై రాబోతున్న కొత్త సినిమా వసుదేవసుతం. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ వదిలి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు మేకర్స్.
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా రెయిన్బో సినిమాస్ బ్యానర్ పై ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఆడియెన్స్‌లో అంచనాల్ని పెంచేశాయి. ఇక రేపు (జూలై 10) మూవీ విడుదలవుతున్న తరుణంలో మరింత హైప్ పెంచేందుకు రిలీజ్ ట్రైలర్‌ను తీసుకు వచ్చారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘చంపడం నాకు సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు’, ‘కొన్ని తప్పుల్ని క్షమించొచ్చు.. అన్ని తప్పులు క్షమిస్తే.. మనం తప్పు చేసినట్టే’, ‘దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నించే ఎవ్విడికీ భూమ్మీద బతికే హక్కు లేదు’ అనే డైలాగ్స్‌తో సాగిన ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఇందులోని వీఎఫ్ఎక్స్ షాట్స్, దేవుడ్ని చూపించిన షాట్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అదిరిపోయాయి. ఇక మణిశర్మ ఇచ్చిన బీజీఎం అయితే ట్రైలర్లో నెక్ట్స్ లెవెల్లో వినిపిస్తోంది.
ట్రైలర్ చూసిన అనంతరం అజయ్ భూపతి చిత్రయూనిట్‌ను అభినందించారు. టీజర్ బాగుందని, విజువల్స్, యాక్షన్ అన్నీ బాగున్నాయని మెచ్చుకున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు. ఆల్రెడీ సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమా ఉందని, కొత్త కథతో సరికొత్తగా తీశారని సెన్సార్ సభ్యులు అభినందించారు. ఈ చిత్రానికి జిజ్జు సన్ని (పార్కింగ్ ఫేమ్) కెమెరామెన్‌గా పని చేశారు. ఇక ఈ మూవీని రేపు (జూలై 10) భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి, జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. మణిశర్మ సంగీతం అందించారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













