భారత పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనపై తనదైన శైలిలో సంచలన సెటైర్లు వేశారు. ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల భేటీపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఇదంతా దేశ ప్రజలతో ఆడుకుంటున్న ఒక పెద్ద ప్రహసనం అని విమర్శించారు. ఇటలీ వెళ్ళడానికి ముందు మోదీ భారతదేశంలో ప్రసంగిస్తూ.. దేశంలోకి ‘ఆర్థిక తుఫాను’ రాబోతోందని, ఎవరూ విదేశాలకు వెళ్లవద్దని దేశ ప్రజలకు హితబోధ చేశారని రాహుల్ గుర్తుచేశారు. కానీ, ఆ మాట చెప్పిన కొద్దిసేపటికే మోదీ మాత్రం తన జేబులో ‘మెలోడీ’ (Melody) చాక్లెట్ పెట్టుకుని, కోట్లాది రూపాయల ఖరీదైన సొంత విమానంలో ఇటలీకి ఎగిరిపోయారని ఎద్దేవా చేశారు. అక్కడికి వెళ్లి ఇటలీ ప్రధాని మెలోనికి ఆ చాక్లెట్ తినిపించి, సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు పతాక స్థాయికి చేరుతుంటే.. ప్రధాని మాత్రం విదేశాల్లో రీల్స్ చేస్తూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
Source link
Rahul Gandhi Satires On PM Modi | మెలోనితో మోదీ..రాహుల్ సెటైర్లు | మెలోనికి 'మెలోడీ' | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










