Raj Nidimoru: భర్త రాజ్ నిడిమోరు ముద్దుపేరు రివీల్ చేసిన సమంత.. భలే ఉంది మావా ఈ పిలుపు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తన భర్త రాజ్ ముద్దుపేరు రివీల్ చేస్తూ తెగ మురిసిపోయింది సమంత. మా ఇంటి బంగారం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సామ్, తన అభిమానులకు వరుస శుభవార్తలు చెబుతోంది.

News18
News18

సమంత రుత్ ప్రభు అభిమానులు డబుల్ ఖుషీ అవుతున్నారు. ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్‌లో భారీ సక్సెస్, మరోవైపు పర్సనల్ లైఫ్‌లో ఎవరూ ఊహించని శుభవార్త చెప్పిన సామ్.. చాలా కాలం తర్వాత ముఖంలో నిజమైన ఆనందంతో కనిపిస్తోంది. గతంలో విడాకులు, ప్రాణాంతకమైన మయోసైటిస్ వ్యాధి బారిన పడటం, సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్.. ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సమంత, ఆ చీకటి రోజులను దాటి ఇప్పుడు మళ్లీ సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అటు కెరీర్‌ను, ఇటు వైవాహిక జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది.

బాక్సాఫీస్ దగ్గర ‘మా ఇంటి బంగారం’ ప్రభంజనం:

దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తోంది. సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సామ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడం సమంత స్టామినాకు నిదర్శనం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

తల్లి కాబోతున్నానంటూ గుడ్ న్యూస్ చెప్పిన సామ్..

సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సమంత, తన అభిమానులకు మరో తీపికబురు అందించింది. తాను త్వరలో తల్లిని కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జూన్ 24 (బుధవారం) హైదరాబాద్ వేదికగా ‘మా ఇంటి బంగారం’ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ.. తాను ప్రెగ్నెంట్ అని, తన జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నారని సంతోషంగా వెల్లడించింది. ఈ వార్త విన్న వెంటనే అక్కడున్న వారంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఒక్క ప్రకటనతో ఆమె అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.

భర్త రాజ్ నిడిమోరు ముద్దుపేరు రివీల్..

ఇదే సక్సెస్ మీట్‌లో సమంత తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత తన ఆన్ స్క్రీన్ భర్త అనిరుధ్ క్యారెక్టర్‌ను ముద్దుగా ‘హనీ’ అని పిలుస్తుంది. దీనిని ప్రస్తావించిన యాంకర్.. “సినిమాలో భర్తను హనీ అని పిలిచారు కదా, మరి నిజ జీవితంలో మీ భర్త రాజ్ నిడిమోరును ఏమని పిలుస్తారు?” అని సరదాగా ప్రశ్నించారు.

దీనికి సమంత సిగ్గుపడుతూ, ఎంతో మురిసిపోతూ సమాధానమిచ్చింది. “రాజ్ వాళ్ల అమ్మగారు, చెల్లి ఇంట్లో తనను ఎంతో ప్రేమగా ‘బాబు’ అని పిలుస్తారు. వాళ్లలాగే నేను కూడా రాజ్‌ను ఎప్పుడూ ‘బాబు’ అని పిలుస్తుంటాను” అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పింది. ప్రస్తుతం సామ్ సిగ్గుపడుతూ చెప్పిన ఈ క్యూట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని, ఇప్పుడు పెళ్లి, కెరీర్ సక్సెస్, ప్రెగ్నెన్సీతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్న సమంతను చూసి నెటిజన్లు మురిసిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా సామ్-రాజ్ దంపతులకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports