మూలాలను మరువని మానవతావాది.. కోట్లాది రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి చేరినా, రజనీకాంత్ తన పాత వృత్తిని, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన నాటి బస్సు డ్రైవర్, ప్రాణ స్నేహితుడు రాజ్ బహదూర్‌ను ఎన్నడూ విస్మరించలేదు. కొన్ని నెలల క్రితం రజనీకాంత్ ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అకస్మాత్తుగా బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ (BMTC) బస్ డిపోను సందర్శించిన విషయం తెలిసిందే. అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత డ్రైవర్లు, కండక్టర్లను ఆత్మీయంగా పలకరించి, వారితో ఫోటోలు దిగి, తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.













