Ram Charan Fever: తిరుపతిలో పెద్ది జోష్.. రామ్ చరణ్ పోస్టర్‌ ముందు ఛత్తీస్‌గఢ్ మహిళల డ్యాన్స్ వైరల్..! Ram Charan Peddha movie celebrations. | | ACTPnews

News18


Last Updated:

తిరుపతిలో పెద్ది రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద రామ్ చరణ్ అభిమానుల హంగామాలో ఛత్తీస్‌గఢ్ మహిళలు కూడా డ్యాన్స్ చేస్తూ పాల్గొనగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

+

News18

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం పెద్ది విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. బెనిఫిట్ షోలతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొనగా.. తిరుపతిలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సినిమా విడుదలల సమయంలో అభిమానుల హంగామా కనిపించడం సహజమే. కానీ ఈసారి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు కూడా పెద్ది సంబరాల్లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

తిరుపతిలోని పలు థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే మెగా అభిమానులు భారీగా తరలివచ్చారు. రామ్ చరణ్ కటౌట్లకు పాలాభిషేకాలు, బాణాసంచా కాల్పులు, డప్పుల మోతలు, నృత్యాలతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అభిమానుల నినాదాలతో థియేటర్ ప్రాంతం మారుమోగిపోగా, పెద్ది విజయాన్ని ముందుగానే సెలబ్రేట్ చేస్తున్నట్లుగా కనిపించింది.

ఇదే సమయంలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు మహిళలు థియేటర్ వద్ద నెలకొన్న ఈ ఉత్సాహభరిత వాతావరణాన్ని గమనించారు. మెగా అభిమానుల సందడి వారికి ఆసక్తి కలిగించడంతో వారు కూడా అక్కడే కొంతసేపు ఆగిపోయారు. అభిమానుల ఆనందంలో భాగమవుతూ రామ్ చరణ్ భారీ పోస్టర్‌ను చేతబట్టి ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

భాష తెలియకపోయినా, సినిమా గురించి పూర్తి అవగాహన లేకపోయినా అక్కడి వాతావరణం వారిని ఆకట్టుకుంది. మెగా అభిమానులతో కలిసి స్టెప్పులు వేస్తూ వారు చేసిన సందడి చుట్టుపక్కల వారిని అలరించింది. ఈ దృశ్యాలను అక్కడున్న అభిమానులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. రామ్ చరణ్ క్రేజ్ రాష్ట్రాల సరిహద్దులు దాటింది, భక్తులు కూడా మెగా ఫ్యాన్స్ అయ్యారు, ఇదే అసలు స్టార్ పవర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన మహిళలు స్వచ్ఛందంగా ‘పెద్ది’ సంబరాల్లో పాల్గొనడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి పెద్ది సినిమా విడుదల సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన మెగా అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. భక్తి యాత్రకు వచ్చిన మహిళలు సైతం రామ్ చరణ్ అభిమానుల సందడిలో కలిసిపోవడం, ఆనందంగా డ్యాన్స్ చేయడం పెద్ది ఫీవర్ ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటిచెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతూ మెగా అభిమానుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports