Last Updated:
ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేవలం భారీ యాక్షన్, కళ్లు చెదిరే గ్రాఫిక్స్, క్రేజీ డ్రామా ఉన్న సినిమాలకే కాకుండా మనసుకు హత్తుకునే సున్నితమైన కథలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేవలం భారీ యాక్షన్, కళ్లు చెదిరే గ్రాఫిక్స్, క్రేజీ డ్రామా ఉన్న సినిమాలకే కాకుండా మనసుకు హత్తుకునే సున్నితమైన కథలకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్‌కు వెళ్లి కుటుంబ సమేతంగా ప్రశాంతంగా చూడగలిగే క్లీన్ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన ప్రేమకథలు తెరపైకి వస్తే, వాటిని అక్కున చేర్చుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి వాతావరణంలో ఒక చక్కటి ఫీల్‌గుడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రమణీ కళ్యాణం’. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేయగా, తాజాగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.
“కోల్పోయిన ప్రతి వారి దగ్గర ఒక కథ ఉంటుంది” అనే ఎంతో బరువైన, అర్థవంతమైన డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ ఒక్క మాట మొదటి క్షణంలోనే ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనం చేస్తుంది. ఇందులో ప్రధాన పాత్రల రూపకల్పన చాలా వైవిధ్యంగా సాగింది. హీరోయిన్ సంజన ఒక ఆర్జే కమ్ సింగర్. ఆమెకు కంటి చూపు లేదు. మరోవైపు హీరో రాజ్ నడవలేని స్థితిలో చక్రాల కుర్చీకే పరిమితమై ఉంటాడు. శారీరకంగా లోపాలు ఉన్నప్పటికీ, మానసికంగా ఎంతో దృఢంగా ఉన్న ఈ ఇద్దరి మధ్య చిగురించే అందమైన ప్రేమకథను దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి అద్భుతంగా మలిచారు. ఎంటర్టైన్మెంట్ జోడిస్తూనే, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఈ కథను చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.
ఈ కథని అత్యంత నేచురల్‌గా డీల్ చేసిన తీరు ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రేక్షకులను ఏడిపించాలనే ఉద్దేశంతో ఎక్కడా బలవంతపు డ్రామా ఇరికించలేదు. మన నిజ జీవితంలో జరిగే చిన్న చిన్న ఎమోషనల్ మూమెంట్స్ ఆధారంగా కథను నడిపించిన విధానం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. లోపాలను పక్కనపెట్టి, ఒకరికొకరు తోడుగా నిలిచే క్రమంలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.
సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్ నటన సినిమాకు ప్రాణం పోసినట్లు అనిపిస్తోంది. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా సహజంగా పండింది. మాటలు లేని చోట కేవలం కళ్లతో, హావభావాలతో పలికించిన సైలెంట్ ఎమోషన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. చూపు లేని అమ్మాయిగా దీప్షిక, చక్రాల కుర్చీలో కూర్చుని జీవితాన్ని సాగించే యువకుడిగా సూర్య తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయారు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, చిన్న చిన్న సంభాషణలు ట్రైలర్‌కు ప్రాణంగా నిలిచాయి.
‘కోర్ట్’ సినిమా ఫేం రామ్ జగదీష్ రాసిన డైలాగ్స్ ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ప్రతి మాట సూటిగా హార్ట్‌ను టచ్ చేసేలా ఉంది. జీవిత సత్యాలను చాలా సింపుల్‌గా, లోతైన అర్థంతో చెప్పారు. టెక్నికల్‌గా కూడా ట్రైలర్ గొప్ప ఇంప్రెషన్ ఇచ్చింది. కెమెరా వర్క్ చాలా ఆహ్లాదకరంగా, సాఫ్ట్ విజువల్స్‌తో సాగింది. కళ్లకు హాయినిచ్చే రంగులతో ప్రతి ఫ్రేమ్ అందంగా ముస్తాబైంది. దీనికి తోడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ సన్నివేశాలకు ప్రాణం పోసింది. సంగీతం సినిమాలోని ఫీల్‌ను అత్యున్నత స్థాయికి ఎలివేట్ చేసింది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














