Ramayana Trailer: బ్రహ్మ ముహూర్తంలో రామాయణ ట్రైలర్ రిలీజ్‌.. హిందూ మతంలో ఈ సమయానికి ఎందుకంత ప్రాముఖ్యత? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Pawan Kalyan: 'ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే'.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


సాధారణంగా పెద్ద సినిమాల ట్రైలర్లు ఉదయం లేదా సాయంత్రం వేళ విడుదల చేస్తుంటారు. కానీ ‘రామాయణం’ వంటి పౌరాణిక కథ ఆధారంగా రూపొందిన సినిమా ట్రైలర్‌ను రిలీజ్ సమయం బ్రాహ్మ ముహూర్తానికి ఎంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రక చిత్రం రామాయణం ట్రైలర్ విడుదలకు కౌంట్‌డౌన్ ఎట్టకేలకు ప్రారంభమైంది. చాలా రోజులుగా ట్రైలర్ విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం చిత్ర యూనిట్ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఈ మేరకు నిర్మాత నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంటూ.. ట్రైలర్ విడుదల తేదీ మరియు సమయాన్ని ప్రకటించారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, చిత్ర బృందం ట్రైలర్‌ను సాధారణ సమయంలో కాకుండా, బ్రహ్మ ముహూర్తంలో విడుదల చేయాలని నిర్ణయించారు.

News18

చిత్ర బృందం నుండి బయటకొచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, రామాయణం సినిమా ట్రైలర్ జూలై 30, గురువారం ఉదయం 4.15 గంటలకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే, నిర్మాత నమిత్ మల్హోత్రా పంచుకున్న పోస్టర్ ప్రకారం, ఈ ట్రైలర్‌ను బ్రహ్మ ముహూర్తంలో ఆవిష్కరించనున్నారు. సాధారణంగా పెద్ద సినిమాల ట్రైలర్లు ఉదయం లేదా సాయంత్రం విడుదలవుతుంటాయి. కానీ ‘రామాయణం’ వంటి పౌరాణిక కథ ఆధారంగా రూపొందిన సినిమా ట్రైలర్‌ను బ్రహ్మ ముహూర్తంలో విడుదల చేయడం ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా మతపరమైన, సాంస్కృతిక నేపథ్యానికి గౌరవం ఇవ్వడానికే ఈ సమయాన్ని ఎంచుకున్నామని చిత్ర బృందం తెలిపింది.

బ్రాహ్మ ముహూర్తం అంటే ఏంటి?

బ్రహ్మీ ముహూర్తం సూర్యోదయానికి ముందు అత్యంత ప్రశాంతమైన సమయంగా పరిగణించబడుతుంది. సాధారణంగా సూర్యోదయానికి గంటన్నర ముందు ప్రారంభమయ్యే ఈ కాలాన్ని అంతిమ రాత్రి అని పిలుస్తారు. ‘బ్రహ్మ’ అంటే పరమాత్మ, ‘ముహూర్తం’ అంటే శుభ సమయం.

హిందూ సంప్రదాయంలో బ్రాహ్మ ముహూర్తం ప్రాముఖ్యత ఏంటి?

హిందూ సంప్రదాయం ప్రకారం.. ధ్యానం, యోగా, జపం, ప్రార్థన, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు బ్రహ్మీ ముహూర్తం అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయం యొక్క ప్రాముఖ్యత పురాణాలు, మత గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది.

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి పలువురు స్టార్స్ కూడా నటిస్తున్నారు. భారీ బడ్జెట్, అద్భుతమైన సాంకేతిక నాణ్యత కారణంగా ఈ చిత్రం ఇప్పటికే భారతదేశంలో, విదేశాలలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. అశేష ప్రేక్షక లోకం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports