4.09 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ ‘రామాయణ’ ట్రైలర్ లో అబ్భురపరిచే ఎన్నో విజువల్స్ ఉన్నాయి. సన్నివేశాలకు తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ వీడియోలో ప్రధాన ఆకర్షణ అయింది. ‘రామానంద్ సాగర్’ సీరియల్ లో రాముడిగా నటించిన నటుడు అరుణ్ గోవిల్.. ఈ సినిమాలో దశరథుడిగా నటిస్తుండగా.. కౌసల్యగా ఇందిరా కృష్ణన్, కైకేయిగా లారాదత్త, సుమిత్రగా సోనల్ ఝా కనిపించనున్నారు. లక్ష్మణుడిగా రవి దూబే, భరతుడిగా ఆదినాథ్ కొఠారే, హనుమాన్ గా సన్నీడియోల్, శతృఘ్నుడిగా నితీశ్ శర్మ, మందాకినిగా కాజల్ అగర్వాల్, సూర్పనఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు.














