Last Updated:
పెళ్లి తర్వాత తొలిసారి జంటగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెండితెరపైకి వస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘రణబాలి’ మూవీపై నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. ‘శ్యామ్ సింగరాయ్’, ‘టాక్సీవాలా’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో (తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం) థియేటర్లలోకి రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విడుదలైన 3 నిమిషాల 47 సెకన్ల ట్రైలర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అద్భుతమైన విజువల్స్, రోమాలు నిక్కబొడుచుకునే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఈ ట్రైలర్‌పై ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రణబాలి రాయలసీమ చరిత్రకు అద్దం పెట్టినట్లుగా ఉందని పేర్కొన్నారు.
Just saw the trailer of #Ranabali and wow, what an immersive experience! The detailing in recreating 1800s Rayalaseema and capturing that heart-wrenching era of British-era famine and oppression is phenomenal.
@TheDeverakonda looks effortlessly fierce and completely at home in the soil of Seema, brilliantly anchored by @iamRashmika. Kudos to @Rahul_Sankrityn and the entire team for bringing such a powerful, untold chapter of history to life. Wishing you all huge success on October 16!https://t.co/lHlmpxca8u
— Lokesh Nara (@naralokesh) October 10, 2026
సోషల్ మీడియా వేదికగా స్పందించిన నారా లోకేష్.. 19వ శతాబ్దపు రాయలసీమ గడ్డపై నాటి బ్రిటిష్ పాలకులు సాగించిన క్రూరమైన అణచివేతను, గుండెల్ని పిండేసే కరవు పరిస్థితులను తెరపై దర్శకుడు అత్యంత వాస్తవికంగా ఆవిష్కరించారని కొనియాడారు. “రాయలసీమ ముద్దుబిడ్డగా, రౌద్ర రూపం దాల్చిన యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ నటన అద్భుతం. ఆయనకు దీటుగా జయమ్మ పాత్రలో రష్మిక మందానా నటన చిత్రానికి ప్రధాన బలంగా నిలిచేలా ఉంది. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన రాయలసీమ వీరోచిత పోరాటాన్ని ఇంత గొప్పగా వెండితెరపైకి తెచ్చిన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌కు ప్రత్యేక అభినందనలు. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని లోకేష్ పేర్కొన్నారు.
1854 నుంచి 1878 మధ్య కాలంలో బ్రిటిష్ ఇండియాలో జరిగిన వాస్తవ చారిత్రక అంశాల ఆధారంగా ఈ సినిమాను మలిచారు. పన్నుల దోపిడీ, ఆకలి కేకలతో అలమటిస్తున్న ప్రజల పక్షాన ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన యోధుడు ‘శింగనమల బొబ్బిలి రణబాలి’గా విజయ్ దేవరకొండ నటన పీక్స్ లో ఉండనుందని ఇప్పటికే వచ్చిన అప్ డేట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఆయన పలికించిన రాయలసీమ యాస, మేకోవర్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది. ఇక గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన రష్మిక మందన్న, ఇందులో డీగ్లామరైజ్డ్ లుక్‌లో సహజత్వంతో కూడిన భావోద్వేగాలను పండించి ఆశ్చర్యపరిచారు.
అజయ్ – అతుల్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మేజర్ అసెట్ కానుందట. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో పాటు సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.














