Rashmika Mandanna: పెళ్లి తర్వాత రష్మిక మందన్న రేంజ్ ఎలా మారిపోయిందో చూశారా? మతిపోయే విషయమిది | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

రీసెంట్ గానే విజయ్ దేవరకొండను పెళ్లాడిన రష్మిక మందన్న.. పెళ్లి తర్వాత సూపర్ ఫామ్ లో ఉంది. అంతేకాదు మ్యారేజ్ అనంతరం ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిందనేది వాస్తవం.

News18
News18

సాధారణంగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు తమ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి విషయానికి కాస్త దూరంగా ఉంటారు. ఒకవేళ వివాహం చేసుకున్నా.. కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వడం చూస్తుంటాం. కానీ, టాలీవుడ్ స్టార్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 26న టాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండను సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ, పెళ్లి తర్వాత అస్సలు బ్రేక్ తీసుకోకుండా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారిపోయింది. రష్మిక లైనప్‌లో ఉందంటేనే ఆ ప్రాజెక్టుకు వచ్చే క్రేజ్ వేరుగా ఉంటోంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ ఈ బ్యూటీ తాజాగా తన పారితోషికాన్ని భారీగా పెంచేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఒక్కో సినిమాకు రూ. 8 కోట్ల నుండి రూ. 10 కోట్ల వరకు అందుకుంటున్న రష్మిక, బాలీవుడ్‌లో మాత్రం ఆ మొత్తాన్ని ఏకంగా రెట్టింపు చేసినట్లు తెలుస్తోంది. జూన్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతున్న బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ రొమాంటిక్ డ్రామా ‘కాక్‌టెయిల్ 2’ చిత్రం కోసం రష్మిక ఏకంగా రూ. 15 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో నటిస్తున్న మరో స్టార్ హీరోయిన్ కృతి సనన్‌కు సైతం సమానంగా రూ. 15 కోట్లే చెల్లించినట్లు టాక్ నడుస్తోంది. సీనియారిటీ పరంగా కృతి సనన్ కంటే రష్మిక జూనియర్ అయినప్పటికీ, నార్త్‌లో రష్మికకు ఉన్న విపరీతమైన పాపులారిటీ కారణంగా మేకర్స్ ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనుకాడలేదు.

కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైన రష్మిక మందన్న, ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకుంది. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్‌బై’, సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, అల్లు అర్జున్ సరసన నటించిన ‘పుష్ప’ ఫ్రాంచైజీ ఈమెకు ఉత్తరాదిలో తిరుగులేని ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దీనికి తోడు గతేడాది విక్కీ కౌశల్ సరసన నటించిన చారిత్రాత్మక చిత్రం ‘ఛావా’ సాధించిన విజయం కూడా రష్మిక కెరీర్‌కు బాగా ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ మేకర్స్ ఆమె అడిగిన రూ. 15 కోట్ల డిమాండ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లోని పలువురు మిడ్-రేంజ్ హీరోల మార్కెట్ విలువతో సమానంగా రష్మిక పారితోషికం అందుకోవడం విశేషం. వివాహ బంధంలోకి అడుగుపెట్టినప్పటికీ, తన స్టార్డమ్‌ను ఏమాత్రం తగ్గించుకోకుండా బాక్సాఫీస్ వద్ద రష్మిక దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘రణబాలి’, ‘మైసా’ వంటి ఆసక్తికరమైన చిత్రాల్లో నటిస్తూనే, బాలీవుడ్‌లో షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి ‘కాక్‌టెయిల్ 2’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. హోమీ అదజానియా దర్శకత్వంలో వస్తున్న ఈ ట్రై యాంగిల్ ప్రేమకథా చిత్రంపై హిందీ బెల్ట్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *