Last Updated:
Revanth Reddy: నగరంలోని అంబర్‌పేట, మూసారాంబాగ్ ప్రాంతాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది.
మూసీ నదిపై రూ.52 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో వర్షాకాలంలో మూసీ నది ఉధృతంగా ప్రవహించినప్పుడు, జంట జలాశయాల గేట్లు ఎత్తిన సమయాల్లో పాత బ్రిడ్జి నీట మునిగి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయేవి. దీనివల్ల వాహనదారులు కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వచ్చేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అత్యాధునిక ప్రమాణాలతో కొత్త హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు.














