RGV On Satluj: సినిమాను ఎన్‌కౌంటర్ చేయకండి.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ కలకలం రేపుతున్న చిత్రం ‘సత్లుజ్’ (Satluj). నేరుగా ఓటీటీలో (Zee 5) విడుదలై, కేవలం 48 గంటల్లోనే తొలగించబడిన ఈ చిత్రంపై తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

News18
News18

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ కలకలం రేపుతున్న చిత్రం ‘సత్లుజ్’ (Satluj). సెన్సార్ బోర్డుతో తీవ్ర వివాదాలు, అనేక కట్స్ ప్రతిపాదనల నేపథ్యంలో నేరుగా ఓటీటీలో (Zee 5) విడుదలై, కేవలం 48 గంటల్లోనే తొలగించబడిన ఈ చిత్రంపై రోజురోజుకూ చర్చ ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వీక్షించిన వివాదాస్పద, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తనదైన శైలిలో స్పందించారు.

సత్లుజ్ చిత్రం కేవలం ఒక సినిమా కాదని, మన దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసే ఒక ‘మానని గాయం’ అంటూ వర్మ సంచలన రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా పాత్రలో దిల్జిత్ దోసాంజ్ (Diljit Dosanjh) నటన అద్భుతమని వర్మ కొనియాడారు. “దిల్జిత్ కేవలం గుండెలు బాదుకుంటూ లౌడ్‌గా నటించలేదు. తన మనస్సాక్షికి లోబడి ఎంతో నిశ్శబ్దంగా, అద్భుతంగా జీవించాడు. అర్జున్ రామ్ పాల్ నటన సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. ప్రభుత్వ వ్యవస్థలే నేరాల్లో ఏ విధంగా భాగమయ్యాయో ఈ సినిమాలో అత్యంత వాస్తవికంగా చూపించారు. అనవసరమైన సంచలనాల కోసం కాకుండా, ఒక పక్కా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ తరహాలో ఈ చిత్రాన్ని మలిచారు.

తెరపై కనిపించే అధికారిక ఫైళ్లు, దహన సంస్కారాల లెక్కలు, పదునైన సంభాషణలు కథలోని తీవ్రతను తెలియజేశాయి. కమర్షియల్ విలువల కోసం కాకుండా సత్యాన్ని నిర్భయంగా వెల్లడించేలా సినిమాను తీర్చిదిద్దారు” అని వర్మ ప్రశంసించారు. సినిమాలోని సెన్సిటివ్ పాయింట్‌ను టచ్ చేస్తూ.. “ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ తన సొంత పౌరులనే ఎలా కబళించిందో, అందుకు కనీస సాక్ష్యాలు కూడా మిగలకుండా ఎలా తుడిచిపెట్టేసిందో ఈ సినిమాలో చూపించడం మామూలు విషయం కాదు. చిత్ర బృందం అసాధారణమైన ధైర్యంతో ఈ సినిమాను తెరకెక్కించింది. ఇది నిజమైన కళ. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆలోచింపజేస్తుంది. సత్యం, నిజాయతీలను ఒక సినిమా మాధ్యమం ద్వారా చెప్పినప్పుడు అది ‘సత్లుజ్’ అవుతుంది. ఇలాంటి సినిమాను అందరూ చూడాలి, చూపించాలి, దానిపై సమాజంలో చర్చ జరగాలి” అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

చివరిగా ప్రభుత్వానికి, అధికారంలో ఉన్నవారికి వర్మ ఒక సూటి విన్నపం చేశారు వర్మ. “సినిమాలో బాధితులను ఎన్‌కౌంటర్ చేసినట్లుగానే, ఇప్పుడు ఈ సినిమాను కూడా ఎన్‌కౌంటర్ చేసి చంపేయకూడదు. అధికారంలో ఉన్న వారందరికీ నాదొక్కటే విన్నపం.. ‘సత్లుజ్’ సినిమాలో జస్వంత్ సింగ్ ఖల్రా (Jaswant Singh Khalra)ను చేసినట్లుగా ఈ సినిమాను అణచివేయకండి. నిజాన్ని ఎంత దాచాలని చూస్తే, అది అంత దృఢంగా మారుతుంది” అంటూ వర్మ తనదైన శైలిలో ట్వీట్ ముగించారు. స్ట్రీమింగ్ నిలిచిపోయిన ఈ సినిమాపై వర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *