Last Updated:
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్) చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారం బయటకొచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ (వర్కింగ్ టైటిల్) చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గతేడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ క్రేజీ కాంబో, ఇప్పుడు మరోసారి అంతకు మించిన మాస్ సునామీ సృష్టించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది.
ఇటీవలే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ షెడ్యూల్లో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కోట్ల రూపాయల ఖర్చుతో ఒక భారీ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ – లక్ష్మణ్ మాస్టర్ల నేతృత్వంలో ఈ భారీ ఫైట్ ఎపిసోడ్ తెరకెక్కుతోంది.
వందల మంది ఫైటర్లు పాల్గొంటున్న ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో చిరంజీవి ఎంతో డెడికేషన్‌తో రిస్కీ స్టంట్స్ చేస్తున్నారని సమాచారం. మునుపెన్నడూ చూడని రీతిలో, ముఖం నిండా ఇంటెన్సిటీతో చిరు ఈ ఫైట్‌లో కనిపిస్తారని, ఇది సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. విపరీతమైన యాక్షన్ ఫీస్ట్ ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా బాబీ ఈ సీన్‌ను డిజైన్ చేశారు.
ఈ సినిమాలో చిరంజీవి లుక్ బయటకు లీక్ కాకుండా దర్శకుడు బాబీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవిని మునుపెన్నడూ చూడని సరికొత్త యాక్షన్ అవతార్‌లో, ఒక ‘బ్లడీ బెంచ్‌మార్క్’ క్రియేట్ చేసేలా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఆయన ఇప్పటికే హింట్ ఇచ్చారు. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రకటనతో మెగా అభిమానుల్లో అప్పుడే పండగ వాతావరణం నెలకొంది.
ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా పేతురాజ్, మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రాలను నిర్మిస్తున్న ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆయనకు టాలీవుడ్లో ఇదే తొలి సినిమా కావడం విశేషం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, భాను-నందు పవర్ ఫుల్ డైలాగ్స్ రాస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అదనపు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, అవినాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్, ఆంటోని ఎల్. రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘విశ్వంభర’ వంటి ఫాంటసీ సోషియో-ఫాంటసీ మూవీ తర్వాత చిరు చేస్తున్న ఈ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్పై ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













