Last Updated:
Road Accident: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే ఐటీవో (ITO) ప్రాంతంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఇద్దరు ఎమ్మెల్యేలతో సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ANI కథనం ప్రకారం.. కిరారీ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని అదుపుతప్పిన మరో కారు బలంగా ఢీకొట్టింది. సెంట్రల్ ఢిల్లీలోని రద్దీ కూడలి వద్ద రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.














