Last Updated:
TS RTC: తెలంగాణలో ప్రజాపాలనకు వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గడిచిన రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు కల్పించిన ఉపాధి, ఉద్యోగాల కల్పనతో పాటు అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మరో శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు టీఎస్ఆర్‌టీసీలో మరో 1500 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది.
TS RTC: తెలంగాణలో ప్రజాపాలనకు వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈసందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో గడిచిన రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలు, నిరుద్యోగ యువతకు కల్పించిన ఉపాధి, ఉద్యోగాల కల్పనతో పాటు అనేక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ మరో శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు టీఎస్ఆర్‌టీసీలో మరో 1500 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈసందర్భంగా రవాణాశాఖను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ఇక ఈ కండక్టర్ పోస్టులకు టెన్త్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మార్కుల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వార్షిక వేతనం వచ్చేసి రూ.3 లక్షలకుపైగా ఉంటుందని సమాచారం. పర్మినెంట్ ఎంప్లాయిస్‌గానే రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది.














