Rugby Premier League: అగ్రస్థానానికి దూసుకెళ్లిన ముంబై డ్రీమర్స్.. చెన్నై బుల్స్ సంచలన విజయం! | క్రీడా వార్తలు | ACTPnews

రగ్బీ ప్రీమియర్‌ లీగ్ 2026


Last Updated:

శుక్రవారం జరిగిన పురుషుల విభాగం మ్యాచ్‌లో ఢిల్లీ రెడ్జ్‌పై ముంబై డ్రీమర్స్ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లగా.. మహిళల విభాగంలో ఢిల్లీ రెడ్జ్‌పై చెన్నై బుల్స్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది.

రగ్బీ ప్రీమియర్‌ లీగ్ 2026
రగ్బీ ప్రీమియర్‌ లీగ్ 2026

Rugby Premier League: గచ్చిబౌలిలోని గంటి మోహన చంద్ర బాలయోగి అథ్లెటిక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ‘హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ పవర్డ్ బై ఆవిడ్ సీజన్ 2’ (HSBC Rugby Premier League Season 2) నాల్గో రోజు మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా సాగాయి. శుక్రవారం జరిగిన పురుషుల విభాగం మ్యాచ్‌లో ఢిల్లీ రెడ్జ్‌పై ముంబై డ్రీమర్స్ ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లగా.. మహిళల విభాగంలో ఢిల్లీ రెడ్జ్‌పై చెన్నై బుల్స్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది.

ముంబై డ్రీమర్స్ వర్సెస్ ఢిల్లీ రెడ్స్ (పురుషుల మ్యాచ్)

పురుషుల విభాగంలో జరిగిన వన్-సైడెడ్ మ్యాచ్‌లో ముంబై డ్రీమర్స్ 31-14 పాయింట్ల తేడాతో ఢిల్లీ రెడ్జ్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభ క్వార్టర్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ.. ముంబై ఆటగాడు నీరజ్ ఖత్రి తొలి పాయింట్ సాధించి డెడ్‌లాక్‌ను బ్రేక్ చేశాడు. ఆ వెంటనే జేమ్స్ టర్నర్ మరో పాయింట్ జోడించడంతో ముంబై పట్టు బిగించింది. రెండో క్వార్టర్‌లో ఢిల్లీ ఆటగాడు జోసెప్ సెరెస్, ప్యాట్రిక్ ఒడోంగోలు ఎదురుదాడికి దిగి పాయింట్లు సాధించినప్పటికీ.. ముంబై ఆటగాడు గుయిలౌమ్ బౌచే అద్భుత ప్రదర్శనతో ముంబై ఆధిక్యాన్ని కాపాడాడు. సెకండ్ హాఫ్‌లోనూ పూర్తి పట్టు సాధించిన ముంబై డ్రీమర్స్.. ఢిల్లీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 31-14తో సులువుగా విజయాన్ని సొంతం చేసుకుంది.

మహిళల విభాగంలో జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో చెన్నై బుల్స్ 31-27 పాయింట్ల తేడాతో ఢిల్లీ రెడ్జ్‌పై విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంలోనే ఢిల్లీ ప్లేయర్ ఈడెన్ కిల్గోర్ పాయింట్ సాధించగా, చెన్నై ప్లేయర్ ఆదియా పై వెంటనే స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఢిల్లీ ప్లేయర్ లవేనా కావూరు ఇంటర్‌సెప్షన్ ట్రైతో మ్యాచ్‌ను ఢిల్లీ వైపు తిప్పింది. అయితే, మూడో క్వార్టర్‌లో చెన్నై ప్లేయర్స్ సవన్నా బౌడర్, లారా రైట్ లు అద్భుతంగా పోరాడి పుంజుకున్నారు. ఆఖరి నిమిషాల్లో ఈడెన్ కిల్గోర్ ఢిల్లీకి ఆధిక్యం అందించినప్పటికీ.. ఎక్స్‌ట్రా టైమ్‌లో సవన్నా బౌడర్ ఒంటరి పోరాటంతో పాయింట్ సాధించి చెన్నై బుల్స్‌కు ఒక అద్భుతమైన కంబ్యాక్ విజయాన్ని అందించింది.

ఇదే రోజు జరగనున్న తదుపరి మ్యాచ్‌ల్లో మహిళల విభాగంలో ముంబై డ్రీమర్స్, కోల్‌కతా బంగా టైగర్స్‌తో తలపడనుండగా.. పురుషుల విభాగంలో బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్, కోల్‌కతా బంగా టైగర్స్ మధ్య చివరి మ్యాచ్ జరగనుంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed