Rupee value: భారీగా పుంజుకున్న రూపాయి.. చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు ! | బిజినెస్ | ACTPnews

News18


Last Updated:

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పతనం కావడంతో డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 52 పైసలు పుంజుకుంది. బుధవారం నాటి ముగింపు 96.82 నుండి గురువారం నాటి ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 96.30 స్థాయికి బలపడింది.

News18
News18

విదేశీ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా దిగిరావడంతో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గురువారం ట్రేడింగ్‌లో ఒక్కసారిగా దూసుకుపోయింది. బుధవారం నాటి ముగింపు ధర 96.82 తో పోలిస్తే, ఈరోజు ఉదయం ప్రారంభంలోనే రూపాయి ఏకంగా 52 పైసలు బలపడి 96.30 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. అంతర్జాతీయంగా ఇంధన ధరల ఒత్తిడి తగ్గడం, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడి క్షీణించడంతో ఎమర్జింగ్ మార్కెట్ కరెన్‌లపై పెట్టుబడిదారులలో సానుకూల సెంటిమెంట్ వ్యక్తమైంది. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల భారతదేశ దిగుమతి వ్యయాల భారం తగ్గి దేశీయ కరెన్సీకి బలమైన మద్దతు లభించింది. గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులు శాంతించడం రూపాయి రికవరీకి పూర్తిగా కలిసివచ్చింది.

మార్కెట్ గణంకాలను పరిశీలిస్తే, ప్రారంభ ట్రేడింగ్‌లోనే దేశీయ కరెన్సీ సుమారు 0.54 శాతం మేర లాభాలను సొంతం చేసుకుంది. నిన్న రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు ఏకంగా 5.6 శాతం మేర పతనమై, ప్రస్తుతం బ్యారెల్‌కు 105 డాలర్ల స్థాయికి చేరువలో కదలడం రూపాయికి పెద్ద ఊరటనిచ్చింది.

అమెరికా ఇంట్రెస్ట్ రేట్ల అంచనాల్లో మార్పులు రావడం, డాలర్ ఇండెక్స్ స్వల్పంగా వెనకడుగు వేయడం వల్ల అంతర్జాతీయ వ్యాపారులు మళ్లీ రూపాయి వైపు మొగ్గు చూపుతున్నారు. చమురు ధరలు ఇదే రీతిన అదుపులో ఉంటే రాబోయే రోజుల్లో రూపాయి మరింత స్థిరపడే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ బిజినెస్ న్యూస్, పర్సనల్ ఫైనాన్స్ టిప్స్, బిజినెస్ ఐడియాస్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ అప్‌డేట్స్, బంగారం ధరలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు బిజినెస్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed