Last Updated:
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా 700 డ్రోన్లు, హైపర్సోనిక్ క్షిపణులతో భీకర దాడికి తెగబడింది. ఈ దాడుల్లో నలుగురు మరణించగా, అనేక నివాస భవనాలు, పాఠశాలలు ధ్వంసమవడంతో ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా భీకర దాడి జరిపింది. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్.. రష్యా అధీనంలో ఉన్న ప్రాంతాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగా మాస్కో ఈ చర్యకు పాల్పడింది. రష్యా ఏకంగా 700 డ్రోన్లు, అత్యంత వేగంగా దూసుకెళ్లే అధునాతన ‘ఓరేష్నిక్’ హైపర్సోనిక్ క్షిపణులతో సహా 50 కి పైగా క్రూయిజ్ క్షిపణులను కీవ్ నగరంపైకి ప్రయోగించింది. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. రాత్రి సమయంలో జరిగిన ఘోర దాడిలో కీవ్ పరిసర ప్రాంతాలలో కనీసం నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. నివాస భవనాలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గిడ్డంగులు ఈ దాడుల్లో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. బాంబుల పేలుళ్ల శబ్దాలతో రాజధాని నగరం దద్దరిల్లిపోవడంతో ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రజలు మెట్రో స్టేషన్లు, భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందారు.
Russia launched one of the largest air attacks of this war on Kyiv this morning.
More than 50 missiles and 700 drones were launched at the city.This video shows a cruise missile hitting central Kyiv pic.twitter.com/D40DH3pWYE
— Visegrád 24 (@visegrad24) May 24, 2026
రష్యా అధీనంలో ఉన్న లుహాన్స్క్ ప్రాంతంలోని ఒక విద్యార్థి వసతి గృహంపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో 18 మంది మరణించారని, దానికి ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడులు జరిపినట్లు మాస్కో ప్రకటించింది. అయితే తాము పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, రష్యా డ్రోన్ కమాండ్ సెంటర్‌పైనే దాడి చేశామని ఉక్రెయిన్ స్పష్టం చేసింది. రష్యా ఈ దాడిలో ఓరేష్నిక్, ఇస్కందర్, కింజాల్, జిర్కాన్ వంటి అత్యంత ప్రమాదకరమైన క్షిపణులను ఉపయోగించింది. ఈ భీకర దాడుల నేపథ్యంలో పొరుగునే ఉన్న నాటో సభ్య దేశం పోలాండ్ సరిహద్దు భద్రత కోసం తమ యుద్ధ విమానాలను గాల్లోకి లేపింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













