మరీ ముఖ్యంగా.. యూత్ మాత్రం పిచ్చ పచ్చిగా చూశారు. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్లో ఏకంగా రూ.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి.. పెట్టిన బడ్జెట్‌కు 5 టైమ్స్ ఎక్కువ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సినిమాకు ప్రొడ్యూసర కూడా కార్తికేయనే. అయితే.. ఈ సినిమా తెచ్చిపెట్టిన క్రేజ్‌ను ఆ తర్వాత కార్తికేయ కంటిన్యూ చేయలేకపోయాడు. ‘హిప్పీ’, ‘గుణ 369′, ’90ML’, ‘చావు కబురు చల్లగా’, ‘రాజా విక్రమార్క’ ఇలా ఒకదానికి మించి ఒకటి డిజాస్టర్ అయ్యాయి. చివరికి విలన్‌గా నానితో కలిసి గ్యాంగ్ లీడర్, అజిత్‌తో వలిమై వంటి సినిమాలు చేసిన అవి కూడా కార్తికేయ కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేకపోయాయి.













