Ryan ten Doeschate: గంభీర్‌కు గుడ్‌బై.. కేకేఆర్‌‌కు హాయ్.. హాయ్.. IPLలో రీ-ఎంట్రీ ఇచ్చిన డచ్ ప్లేయర్! | క్రీడా వార్తలు | ACTPnews

PC: X.com


Last Updated:

Ryan ten Doeschate: భారత పురుషుల క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా చేసిన కనీసం 24 గంటలు కూడా గడవకముందే, నెదర్లాండ్స్ మాజీ ఆల్‌రౌండర్ ర్యాన్ డస్కాటె (Ryan ten Doeschate) మళ్లీ తన పాత గూటికి చేరుకున్నాడు.

PC: X.com
PC: X.com

నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ గ్లోబల్ లీడర్‌షిప్ విభాగంలో సృష్టించిన కొత్త బాధ్యతతో ఆయన తిరిగి కేకేఆర్ (KKR) కుటుంబంలో చేరారు. నైట్ రైడర్స్ స్పోర్ట్స్ జూలై 29న ఒక ప్రకటన విడుద‌ల చేసింది. ర్యాన్ డస్కాటెను తమ సంస్థ ‘హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ’ (Head of Cricket Strategy)గా నియమించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఫ్రాంచైజీ నెట్‌వర్క్ క్రికెట్ కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు, విదేశాల్లోని మూడు నైట్ రైడర్స్ జట్లకు ఆయన ఆన్-ఫీల్డ్ కోచింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు.

భారత జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో రెండేళ్లపాటు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన టెన్ డోషేట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఫ్రాంచైజీలలో సుదీర్ఘమైన క్రికెట్ నిర్మాణాన్ని నిర్మించే అవకాశం రావడమే తాను ఈ బాధ్యతను స్వీకరించడానికి కారణమని పేర్కొన్నాడు.

“నైట్ రైడర్స్ కుటుంబంలోకి ఈ కొత్త పాత్రతో తిరిగి రావడం నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఫ్రాంచైజీలలో కోచింగ్, అనలిటిక్స్ బృందాలతో కలిసి పనిచేయడానికి, ఆటగాళ్ల స్కౌటింగ్/డెవలప్‌మెంట్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, దీర్ఘకాలిక క్రికెట్ వ్యూహాన్ని రూపొందించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం” అని ర్యాన్ డస్కాటె వ్యాఖ్యానించాడు.

2011లో ఆయన ఒక ఆటగాడిగా కేకేఆర్ జట్టులో చేరి, 2012,2014 లలో ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్న జట్టులో కీలక పాత్ర పోషించాడు. రిటైర్మెంట్ తర్వాత 2022లో సపోర్ట్ స్టాఫ్‌గా తిరిగి వచ్చి.. 2024లో గంభీర్ మార్గదర్శకత్వంలో కేకేఆర్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు నూతన బాధ్యతల్లో భాగంగా, గ్లోబల్ ఫ్రాంచైజీల వ్యాప్తంగా స్కౌటింగ్, ప్లేయర్ రిక్రూట్‌మెంట్, స్క్వాడ్ ప్లానింగ్, ప్రదర్శనల మూల్యాంకనానికి ఆయన నాయకత్వం వహిస్తారు. వీటితో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, ILT20 లో అబుదాబి నైట్ రైడర్స్, మేజర్ లీగ్ క్రికెట్ (MLC) లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్లకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా వ్యవహరించనున్నారు.

ముగిసిన టీమిండియా ప్రయాణం

భారత జట్టుతో విజయవంతమైన, కానీ స్వల్పకాలిక ప్రయాణం ముగిసిన వెంటనే టెన్ డోషేట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 2024 టి20 ప్రపంచ కప్ విజయం తర్వాత గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ర్యాన్ డస్కాటె జాతీయ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో చేరాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో కలిసి పనిచేస్తూ బ్యాటింగ్ ప్రిపరేషన్, ఫీల్డింగ్ సెషన్లు, వ్యూహాత్మక ప్రణాళికల్లో కీలక పాత్ర పోషించాడు.

ఆయన హయాంలో భారత జట్టు 2025 ఆసియా కప్‌ను గెలుచుకోవడమే కాకుండా, 2026 T20 ప్రపంచ కప్ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. అయితే, అదే సమయంలో టెస్టుల్లో జట్టు ప్రదర్శన హెచ్చుతగ్గులకు లోనైంది.

వాస్తవానికి బీసీసీఐ ర్యాన్ డస్కాటెను 2027 వరకు కొనసాగించాలని కోరినప్పటికీ, గడిచిన రెండేళ్లుగా అంతర్జాతీయ పర్యటనల ఒత్తిడి కారణంగా తన చిన్న కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికై వ్యక్తిగత కారణాలతో 45 ఏళ్ల ర్యాన్ డస్కాటె ఆ ఆఫర్‌ను తిరస్కరించారని తెలుస్తోంది. మరోవైపు, మొదట్లో ప్రత్యేక ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు దక్కుతాయని ఆశించిన ఆయనకు స్పష్టమైన కోచింగ్ రోల్ కేటాయించకపోవడం కూడా ఈ వైదొలగానికి ఒక కారణమని PTI కథనం పేర్కొంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports