Last Updated:
తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త కంటెంట్‌తో దూసుకుపోతున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha OTT), క్రికెట్ అభిమానులకు, సినీ ప్రియులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
తెలుగు ఓటీటీ రంగంలో సరికొత్త కంటెంట్‌తో దూసుకుపోతున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha OTT), క్రికెట్ అభిమానులకు, సినీ ప్రియులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన దిగ్గజ ఆటగాడు, ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) జీవిత ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ డాక్యుమెంటరీ త్వరలోనే ఆహా వేదికగా స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ మేరకు ఆహా యాజమాన్యం అధికారికంగా ఒక ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేసింది.
“ఒక కల.. ఒక బ్యాట్.. యావత్ ప్రపంచాన్ని ఉత్తేజపరిచిన ఒక అద్భుత ప్రయాణం! క్రికెట్‌కు దేవుడిగా మారిన ఒకే ఒక్కడి కథ.. ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ (Sachin: A Billion Dreams) త్వరలోనే మీ ఆహా వేదికపై అందుబాటులోకి రానుంది” అంటూ క్యాప్షన్ ఇచ్చి ఈ విషయాన్ని వెల్లడించారు.
జేమ్స్ ఎర్స్‌కిన్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత రవి భాగ్‌చంద్క నిర్మాణంలో 2017లో థియేటర్లలో విడుదలైన ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ ఒక భారీ సంచలనాన్ని సృష్టించింది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అప్పట్లో హిందీ, ఇంగ్లీష్, మరాఠీలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇందులో సచిన్ చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబ విశేషాలు, క్రికెట్ కెరీర్‌లోని అరుదైన రియల్ ఫుటేజీలు (Real footage) ప్రధానంగా చూపించారు. అయితే ఇప్పుడు ఈ డాక్యుమెంటరీని డిజిటల్ రూపంలో సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ‘ఆహా’ ప్లాన్ చేస్తోందా? లేక కొత్త సిరీస్ రూపొందిస్తున్నారా అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్స్.
కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను నెలకొల్పారు. డిసెంబర్ 11, 1988న ముంబైలోని వాంఖడే స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సచిన్ ముంబై (అప్పటి బొంబాయి) తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్‌లోనే అజేయంగా 100 పరుగులు చేసి, అతి చిన్న వయసులోనే రంజీ అరంగేట్రంలో సెంచరీ చేసిన రికార్డు సృష్టించారు. ఆపై
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఓవరాల్‌గా 34,357 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ సచిన్. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 100 సెంచరీలు పూర్తి చేసిన ఒకే ఒక్క ఆటగాడు ఈ ‘మాస్టర్ బ్లాస్టర్’.
2011లో భారత జట్టు వన్డే ప్రపంచకప్ గెలవడంలో సచిన్ కీలక పాత్ర పోషించారు, ఇది ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద కలగా నిలిచింది. ప్రస్తుతం ఈ గ్లోబల్ లెజెండ్ ప్రయాణాన్ని తెలుగు డిజిటల్ ఆడియన్స్ కోసం ఆహా తీసుకురానుండటంతో, సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అతి త్వరలోనే దీని స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













