Last Updated:
పెళ్లి, ప్రేమ, వ్యక్తిగత స్వేచ్ఛపై సమంత, శోభిత ధూళిపాళ్ల అభిప్రాయాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. వివాహ బంధంపై ఇద్దరు హీరోయిన్లు వ్యక్తం చేసిన ఆలోచనల్లోని సారూప్యతలు, భిన్నతలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
టాలీవుడ్‌లో అగ్ర కథానాయికలుగా గుర్తింపు తెచ్చుకున్న సమంత రూత్ ప్రభు, శోభిత ధూళిపాళ్ల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత సంబంధాలపై వీరిద్దరూ వ్యక్తం చేసిన అభిప్రాయాలు తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా వీరిద్దరూ వేర్వేరు సందర్భాల్లో వివాహ వ్యవస్థపై వెల్లడించిన అభిప్రాయాలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సమంత రూత్ ప్రభు తన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాల నేపథ్యంలో పెళ్లి అనే బంధంపై పలు సందర్భాల్లో భావోద్వేగంగా మాట్లాడారు. ఇటీవల జరిగిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ వ్యాఖ్యల వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. పెళ్లి, బంధాలపై సమంత మాట్లాడిన మాటలు.. గతంలో నటి శోభితా ధూళిపాళ్ల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఉన్నాయంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు రెండు వీడియోలను జోడించి విపరీతంగా చర్చించుకుంటున్నారు.
నాగచైతన్యతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సందర్భంలో శోభితా ధూళిపాళ్ల తన వెడ్డింగ్ వీడియోలో మాట్లాడుతూ ఇలా పేర్కొన్నారు.. “ఒక వ్యక్తి అసంపూర్ణంగా ఉంటాడని, ఇంకొకరు వచ్చి ఆ ఖాళీని భర్తీ చేస్తారని నేను నమ్ముతాను. ఎవరికి వారు ఒంటరిగా సంపూర్ణులే అయినప్పటికీ.. భాగస్వామి లేని సమయంలో మనం పూర్తిగా సంపూర్ణం కాలేము. ఎప్పుడైతే మన భాగస్వామి మన జీవితంలోకి వస్తాడో అప్పుడే సంపూర్ణం అవుతాము అని పేర్కొన్నారు (In his absence, I would not be full).”సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
శోభిత చెప్పిన “భాగస్వామి వచ్చి మన జీవితంలోని ఖాళీని భర్తీ చేస్తారు, లైఫ్‌ను పూర్తి చేస్తారు” అనే పాయింట్‌ను ఉద్దేశించే.. సమంత తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సమంత తన స్పీచ్‌లో.. “నన్ను ఎవరో ఒకరు వచ్చి పూర్తి చేయాలని అసంపూర్ణంగా భావిస్తూ ఎదురుచూస్తేనే తప్పులు జరుగుతాయి. ఒకరి అబ్సెన్స్ వల్ల మనం ఇన్-కంప్లీట్ అయిపోకూడదు” అని ఖచ్చితంగా శోభిత మాటలకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమంత తన ప్రసంగంలో ఎక్కడా శోభిత పేరు గానీ, నాగచైతన్య పేరు గానీ నేరుగా ప్రస్తావించనప్పటికీ, బంధాల పట్ల ఈ ఇద్దరు భామల పరస్పర విరుద్ధమైన ఆలోచనా విధానాలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
“ఒక వ్యక్తి అసంపూర్ణంగా ఉన్నాడని, ఇంకొకరు వచ్చి ఆ శూన్యాన్ని భర్తీ చేస్తారని నేనైతే నమ్మను. మనకు మనమే సంపూర్ణంగా ఉండాలి. ఒకరి ఉనికి లేనంత మాత్రాన మనం తక్కువైపోకూడదు. కెరీర్ లాంటి విషయాలు మన చేతుల్లో ఉంటాయి కానీ, కొన్నిసార్లు రిలేషన్‌షిప్స్ చాలా క్లిష్టంగా మారుతుంటాయి. అవి ఎప్పుడూ మన నియంత్రణలో ఉండవు. ఒక బంధం నిలబడాలంటే ఇద్దరు వ్యక్తుల కృషి అవసరం.
సమంత మాట్లాడుతూ, చాలామంది అమ్మాయిలు తమను ఎవరో ఒకరు వచ్చి పూర్తి చేయాలని కోరుకుంటారని, అక్కడే తప్పులు జరుగుతాయని పేర్కొన్నారు. “ఒక మహిళకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన మొదటి లక్షణం.. తనపై తనకు నమ్మకం (సెల్ఫ్ కాన్ఫిడెన్స్) ఉండటం. ఒక వ్యక్తిగా తాను సంపూర్ణంగా ఉన్నప్పుడే సరైన భాగస్వామి దొరుకుతారు. అలా కాకుండా, నన్ను ఎవరో ఒకరు వచ్చి సంతోషపెట్టాలి, నన్ను పూర్తి చేయాలి అని మనం అసంపూర్ణంగా భావిస్తూ ఎదురుచూస్తే.. అవతలి వ్యక్తిపై అంచనాలు ఎక్కువైపోతాయి. అది కరెక్ట్ కాదు. అందుకే ఎవరైనా సరే.. బంధంలోకి అడుగుపెట్టే ముందే మీకు మీరుగా సంపూర్ణంగా ఉండండి.” ప్రస్తుతం ఇంటెర్నెట్ అంతా ఈ ఇద్దరి తారల మాటలపై చర్చలు జరుగుతున్నాయి.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













