Samantha Ruth Prabhu: వంట రాని కోడలు వంటల షోకు హోస్ట్ అయితే..! సమంత సరికొత్త రియాలిటీ షో | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సరికొత్త రియాలిటీ షోకి హోస్ట్ గా చేయబోతున్నారు. తాజాగా ఈ షో ప్రోమో వదిలారు.

News18
News18

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, తన కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. వెండితెరపై తనదైన నటనతో మెప్పించే ఈ బ్యూటీ, ఇప్పుడు బుల్లితెర/ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సరికొత్త జర్నీని ప్రారంభించనున్నారు. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాతో బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కొట్టిన సమంత.. ఇప్పుడు ప్రముఖ కుకింగ్ రియాలిటీ షో ‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్‌ తమిళ్‌’ (Celebrity MasterChef Tamil) కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శనివారం సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ అధికారికంగా ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అదిరిపోయే ప్రోమోను విడుదల చేసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *