Samantha Ruth Prabhu: సినిమా విడుదలకు ముందు చెన్నైలో సీఎం విజయ్‌ని కలిసిన సమంత.. ఆ సీక్రెట్ మీటింగ్ అందుకే.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసిన సమంత రూత్ ప్రభు భావోద్వేగ పోస్ట్‌తో ఆకట్టుకుంది. విజయ్ కేవలం హీరో కాదు, ప్రజల కోసం పుట్టిన నాయకుడని ప్రశంసిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది.

News18
News18

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత, నటుడు విజయ్‌ను చెన్నైలో కలిసింది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ హృదయాన్ని హత్తుకునే సందేశాన్ని రాసింది. విజయ్ కేవలం తెరపై హీరోగా మాత్రమే ఉండే వ్యక్తి కాదని, ఆయనలో ఎప్పటి నుంచో మరింత గొప్ప లక్ష్యం కనిపించేదని సమంత పేర్కొంది.

చెన్నై చేరుకున్న వెంటనే తనలో ఒక ప్రత్యేకమైన ఆనందం కలిగిందని, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవబోతున్నాననే ఉత్సాహం తనలో ఉందని సమంత చెప్పింది. అభిమానులు ప్రేమగా ‘దళపతి’ అని పిలిచే విజయ్‌లో ఎప్పటి నుంచో ఒక ప్రత్యేకమైన శక్తి, ఆకర్షణ కనిపించేదని తెలిపింది. ప్రజలు ఆయనకు ఇచ్చే స్పందనను చూసినప్పుడల్లా ఆయన మరింత గొప్ప బాధ్యతల కోసం పుట్టిన వ్యక్తిలా అనిపించేవారని పేర్కొంది.

ఇప్పటికే సినీ రంగంలో అగ్రస్థానాన్ని అందుకున్న వ్యక్తి, పూర్తిగా కొత్త రంగంలోకి అడుగుపెట్టి, మరింత పెద్ద సవాళ్లను స్వీకరించడం చాలా ధైర్యం కావాలని సమంత అభిప్రాయపడింది. “సులభమైన మార్గాన్ని ఎంచుకోవడం కాదు.. సమాజంలో మార్పు తీసుకురాగలననే నమ్మకంతో ముందుకు సాగడం నిజమైన ధైర్యం” అంటూ విజయ్‌ను ప్రశంసించింది.

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక దశలో తమకోసం మాత్రమే కాకుండా సమాజం కోసం ఏం చేయగలమనే ఆలోచన వస్తుందని, కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ పిలుపును స్వీకరిస్తారని సమంత పేర్కొంది. విజయ్‌ను ఇప్పటికే నమ్ముతున్న వారిని కూడా ఆయన భవిష్యత్తులో ఆశ్చర్యపరుస్తారని తనకు బలమైన నమ్మకం ఉందని చెప్పింది. అది ఆయన పదవి వల్ల కాదని, ప్రజల కోసం పనిచేయాలనే ఆయన ఉద్దేశం వల్లేనని వివరించింది.

విజయ్‌కు శక్తి, జ్ఞానం, సరైన దారిలో ముందుకు సాగే ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ సమంత తన సందేశాన్ని ముగించింది. యువత కూడా తమ కలలకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజానికి ఎలా ఉపయోగపడగలమనే దిశగా ఆలోచించాలని ఆమె సూచించింది.

ఇదిలా ఉంటే సమంత, విజయ్ కలిసి గతంలో ‘కత్తి’, ‘తేరి’, ‘మెర్సల్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. వీరిద్దరి జోడీకి తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ లభించింది. ఇప్పుడు రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయ్‌కు సమంత ఇచ్చిన మద్దతు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports