Samantha: సమంతకు విజయ్ గండం.. ‘మా ఇంటి బంగారం’ సినిమా అక్కడ లేనట్లేనా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంతా, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

News18
News18

స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం “మా ఇంటి బంగారం”. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్, గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సమంతా, నందిని రెడ్డి కలయికలో వస్తున్న మరో సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. టీజర్‌లో సమంతా గంభీరమైన పాత్రలో కనిపించడంతో సినిమా ఎలా ఉండబోతుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి “మా ఇంటి బంగారం” సినిమాను మే 14న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడం, ప్రమోషన్స్‌కు సరిపడా సమయం లేకపోవడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. మొదట జూన్ 4న విడుదల చేయాలని అనుకున్నా, అదే సమయంలో ఇతర పెద్ద సినిమాలు రిలీజ్‌కు రావడంతో చివరకు జూన్ 19 తేదీని ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్‌ను కొనసాగించాలా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. కారణం తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న “జన నాయకుడు” సినిమా కూడా అదే సమయంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం రావడం. దీంతో తమిళ వెర్షన్‌కు థియేటర్ల విషయంలో పోటీ పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగులో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, తమిళం మరియు మలయాళం వెర్షన్లకు మాత్రం విజయ్ సినిమా ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న చివరి సినిమా కావడంతో “జన నాయకుడు”పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందోనని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే “మా ఇంటి బంగారం” కథ పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈరోజు “మా ఇంటి బంగారం” ట్రైలర్ విడుదల కానుండటంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ట్రలాల మూవింగ్ పిక్చర్స్ సంస్థ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ప్రత్యేక పోస్టర్‌లో సమంతా సీరియస్ లుక్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది.  ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, యాక్షన్ సన్నివేశాలు, సరదా హాస్యం అన్నీ కలగలిపి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేలా సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంతా, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *