Secret Behind the Malayalam Superstar | మోహన్ లాల్ @ 66..మోహన్ లాల్ కెరీర్ సీక్రెట్ | ACTPnews

Secret Behind the Malayalam Superstar | మోహన్ లాల్ @ 66..మోహన్ లాల్ కెరీర్ సీక్రెట్



భారతీయ చలనచిత్ర రంగానికి నటనలో సరికొత్త పాఠాలు నేర్పిన మలయాళీ యూనివర్సల్ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురువారం (మే 21) తన 66వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన తన అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఆయన మరో మైలురాయిని చేరుకున్నారు. మే 21, 1960న కేరళలోని ఎలంతూర్లో జన్మించిన మోహన్ లాల్ విశ్వనాథన్.. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 400కు పైగా సినిమాల్లో నటించి భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. మంజిల్ విరింజ పూకల్ సినిమాలో విలన్గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత 80, 90వ దశకాల్లో వరుస కమర్షియల్, క్లాసిక్ హిట్లతో మలయాళ ఇండస్ట్రీకి తిరుగులేని సూపర్ స్టార్గా మారారు. పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయడమే ఆయన కెరీర్ సక్సెస్ సీక్రెట్. తెలుగులోనూ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించిన జనతా గ్యారేజ్ సినిమాతో పాటు మన్యం పులి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మోహన్ లాల్ చెరపరాని ముద్ర వేసుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed