Senior Heroine: దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి హీరోయిన్ రీఎంట్రీ.. అలాంటి పాత్రలు చేయడానికి అస్సలు మొహమాటం లేదట.. | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

Senior Heroine: దాదాపు 30 ఏళ్ల తర్వాత సీనియర్ నటి మీనాక్షి శేషాద్రి మళ్లీ నటిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. సినిమాలు, OTTల్లో మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని ఆమె వెల్లడించారు.

News18
News18

సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన చాలామంది నటీమణులు పెళ్లి, కుటుంబ బాధ్యతలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరమవుతుంటారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా మంచి పాత్రలకు ప్రాధాన్యం పెరగడంతో, చాలా మంది మాజీ హీరోయిన్లు మళ్లీ రీఎంట్రీ ఇస్తూ సెకెండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న వారు ఇప్పుడు తల్లి, కీలక మహిళా పాత్రలు, పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా OTTల రాకతో అనుభవం ఉన్న నటీమణులకు మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో చాలామంది సీనియర్ హీరోయిన్లు మరోసారి కెమెరా ముందుకు వచ్చి తమ నటనతో కొత్త తరాన్నీ ఆకట్టుకుంటున్నారు.

ఒకప్పుడు బాలీవుడ్‌లో తన అందం, నటన, నృత్యంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన సీనియర్ నటి మీనాక్షి శేషాద్రి ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినీ ప్రపంచానికి దూరంగా ఉన్న ఆమె, తిరిగి నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మీనాక్షి, ఇప్పుడు మరోసారి కెమెరా ముందుకు రావాలని నిర్ణయించుకోవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

1980, 90 దశకాల్లో హిందీ చిత్రపరిశ్రమలో మీనాక్షి శేషాద్రికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ‘హీరో’, ‘దామిని’, ‘ఘాయల్’, ‘షహెన్‌షా’ వంటి సినిమాలతో ఆమె ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నటనతో పాటు క్లాసికల్ డాన్స్‌లోనూ ఆమెకు మంచి ప్రావీణ్యం ఉంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్న ఆమె, పెళ్లి తర్వాత సినిమా రంగానికి పూర్తిగా దూరమయ్యారు. భర్త, పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడిన ఆమె కుటుంబ జీవితానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

ఇప్పుడు దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వచ్చిన మీనాక్షి శేషాద్రి, నటిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ముంబై తన ‘కర్మభూమి’ అని పేర్కొంటూ, మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెడుతున్నానని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు. సినిమాలు మాత్రమే కాదు, OTT ప్రాజెక్టుల్లో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే కేవలం కనిపించేందుకు చేసే పాత్రలు కాకుండా, తన నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు.

తనకు ఇప్పటికే కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ, అవి తనను పూర్తిగా ఆకట్టుకోలేదని మీనాక్షి వెల్లడించారు. నటిగా కొత్త కోణాలను ఆవిష్కరించే పాత్రలు చేయాలనే ఆసక్తి ఉందని చెప్పారు. ఏజెంట్ల ద్వారా కాకుండా స్వయంగా అవకాశాలను పరిశీలిస్తున్నానని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

మీనాక్షి శేషాద్రి రీఎంట్రీ వార్తలతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ నటి ఇప్పుడు ఎలాంటి పాత్రతో తిరిగి వస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు “మళ్లీ తెరపై మీనాక్షిని చూడాలని ఎదురుచూస్తున్నాం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఏ సినిమా ద్వారా ఉండబోతోంది? దర్శకులు ఆమె కోసం ఎలాంటి పాత్రలు సిద్ధం చేస్తున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన స్టార్ హీరోయిన్, ఇప్పుడు కొత్త తరం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *