Shivaji: సునీల్‌కి రాసి పెట్టి ఉంది, కానీ ఆ క్యారెక్టర్ నాదే.. పుష్ప సీక్రెట్స్ బయటపెట్టిన శివాజీ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్ర ఎంత పాపులర్ అయ్యిందో మనందరికి తెలుసు. అయితే ఆ రోల్ తొలుత తన వద్దకే వచ్చిందని అంటున్నారు శివాజీ.

News18
News18

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో ప్రతి పాత్రకూ ప్రత్యేక గుర్తింపు దక్కింది. ముఖ్యంగా ‘మంగళం శ్రీను’ అనే విలన్ పాత్రలో ప్రముఖ నటుడు సునీల్ తన విశ్వరూపం చూపించారు. అప్పటివరకు కమెడియన్‌గా, హీరోగా సాఫ్ట్ రోల్స్ చేసిన సునీల్.. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా బిజీ అయిపోయారు. అయితే, సునీల్ కెరీర్‌ను మలుపుతిప్పిన ఈ పవర్‌ఫుల్ పాత్రను మొదట తాను చేయాల్సి ఉందని ప్రముఖ నటుడు శివాజీ (Shivaji) తాజాగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తాజాగా ‘తెల్ల కాగితం’ (Tella Kagitam) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన శివాజీ.. తన సినీ ప్రయాణం గురించి, కోల్పోయిన అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమాలో మంగళం శ్రీను పాత్రకు ముందుగా తనను అనుకున్నారని, కానీ అది కుదరలేదని తెలిపారు. “ఏ పాత్ర ఎవరికి రాసిపెట్టి ఉంటే వారికే దక్కుతుంది. మంగళం శ్రీను పాత్ర సునీల్‌కు రాసిపెట్టి ఉంది, అందుకే ఆయన చేశారు. ఆ పాత్ర వేరేవాళ్ళు చేస్తే ఎలా ఉండేదో చెప్పలేం” అని శివాజీ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, ’90స్’ వెబ్ సిరీస్‌తో భారీ విజయాన్ని అందుకున్న శివాజీ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ఇదే వేదికపై ‘తెల్ల కాగితం’ సినిమా ప్రయాణం గురించి కూడా శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత నేను కమిట్ అయిన తొలి చిత్రం ‘కూర్మావతారం’. అది గ్రాఫిక్స్ పనుల్లో ఉంది. ఆ తర్వాత నేను విన్న రెండో కథ ఈ ‘తెల్ల కాగితం’. ఈటీవీ విన్ సాయికృష్ణ ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. నాకు ఎంతగానో నచ్చడంతో నేనే స్వయంగా ఈ సినిమాను నిర్మించాలని అనుకున్నాను. కానీ, దర్శకుడు రమేష్ బండ్రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ద్వారా ఈ కథ దిల్ రాజు, నిర్మాత కృష్ణ కొమ్మలపాటి వద్దకు వెళ్లింది. దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత దొరికాక నా వద్దకు ఎందుకు వస్తారులే అనుకున్నాను. ఈ సినిమాలో కూడా నాకు ఒక పాత్ర ఆఫర్ చేశారు. కానీ ఫ్రెష్‌నెస్ కోసం వేరే నటుడితో చేయించారు. అయినా మంచి చిత్రాలు ఎవరికి రాసిపెట్టి ఉంటే వాళ్లే చేస్తారు” అని శివాజీ వివరించారు.

రాజమండ్రి నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని శివాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో నటిస్తున్న హీరో రోషన్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని, కాకినాడలో ఉంటూనే అద్భుతమైన బాణీలు అందిస్తున్న సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒక సినిమా విజయం సాధించాలంటే దానికి పనిచేసే ప్రతి ఒక్కరి కష్టం ఉంటుందని, ఈ సినిమా నిర్మాత కృష్ణకు మంచి లాభాలు తీసుకురావాలని శివాజీ కోరుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed