Singer Sunitha Vs Chinmayi: ముదిరిన నా బాడీ నా ఇష్టం వివాదం.. అందుకే అన్నానంటూ సింగర్ సునీత బోల్డ్ రియాక్షన్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నా శరీరం, నా ఇష్టం అని మహిళలు అనుకుంటే, వాడి కళ్లు వాడి ఇష్టం అని ఎదుటివారు కూడా అనుకుంటారు అని సింగర్ సునీత చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపడంతో ఈ ఇష్యూపై చిన్మయి ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో మరోసారి సింగర్ సునీత స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

News18
News18

మహిళల వస్త్రధారణ, స్వేచ్ఛపై టాలీవుడ్ ఫేమస్ సింగర్ సునీత చేసిన కొన్ని కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. నా శరీరం, నా ఇష్టం అని మహిళలు అనుకుంటే, వాడి కళ్లు వాడి ఇష్టం అని ఎదుటివారు కూడా అనుకుంటారు అని చెప్పారు. అవతలి వాళ్ల చూపులను కంట్రోల్ చేసే బదులు, మన వస్త్రధారణ విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

మహిళల భద్రత, ‘మీటూ’ ఉద్యమం విషయంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సునీత మాట్లాడిన తీరు మహిళలను మరింత డ్యామేజ్ చేసేలా, సమాజంలో జరుగుతున్న తప్పును బాధితుల వైపే చూపేలా (విక్టిమ్ బ్లేమింగ్) ఉందని చిన్మయి అన్నారు.

చిన్మయి కామెంట్స్, నెటిజన్ల విమర్శల నేపథ్యంలో సింగర్ సునీత తాజాగా ఓ వీడియోను విడుదల చేస్తూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. “నాపై చిన్మయికి ఎంత గౌరవం ఉందో, ఆమెపై నాకు కూడా అంతే గౌరవం ఉంది. నా మాటలు మిస్ లీడ్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు (చిన్మయి) అన్నారు. అయితే ‘నా శరీరం నా ఇష్టం’ అనే పదానికి అర్థమేంటో నాకు స్పష్టంగా తెలుసు. ఒకరి నియంత్రణలో ఉండకపోవడం, మన శరీరంపై మనకే పూర్తి హక్కు, అర్హత, బాధ్యత ఉండటం అని అర్థం. నేను ఒక వ్యక్తిగా పుట్టాను కాబట్టి ఎవరి కంట్రోల్‌లోనూ ఉండకూడదనే కోరుకుంటాను. దీని చుట్టూ రకరకాల సామాజిక అంశాలు ముడిపడి ఉన్నాయని నాకు తెలుసు. నేను ఎందుకు అలా అన్నానంటే.. మనం ఉన్నది అలాంటి సమాజంలో. ఎదుటివారి చూపులు మనల్ని ఇబ్బంది పెట్టేలా ఉన్న సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పాను” అని సునీత క్లారిటీ ఇచ్చారు.

తాను ఎప్పుడూ తప్పు చేసే వారిని సమర్థించనని సునీత స్పష్టం చేశారు. “ఎవడైనా వచ్చి నా చేయి నా ఇష్టం అంటూ అసభ్యంగా ప్రవర్తిస్తే వెళ్లి వాడి చేతులు విరగ్గొట్టేవాళ్లలో నేను ముందుంటాను. నేనెప్పుడూ తప్పుదోవ పట్టించేలా మాట్లాడటానికి ప్రయత్నించలేదు. దయచేసి ఇంటర్వ్యూ మొత్తం వీడియో చూడండి, అప్పుడు నా ఉద్దేశం ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి వేధింపులు అనుభవించిన వాళ్లలో నేను కూడా ఉన్నాను. మహిళలపై వేధింపులను, ఇబ్బంది పెట్టే పరిస్థితులను నేనెప్పటికీ అంగీకరించను, నాకు అది ఓకే కాదు” అని సునీత గట్టి కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో, నెట్టింట హాట్ టాపిక్‌ అయింది. మహిళల స్వేచ్ఛ వర్సెస్ సమాజంలో వాస్తవ పరిస్థితులు అనే అంశంపై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports