Last Updated:
ఎమోషన్స్, బాధను ఎలా కంట్రోల్ చేసుకుంటారో భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తాజాగా బయటపెట్టారు. తనపై ఇతరులు జాలి చూపించడాన్ని తీవ్రంగా ద్వేషిస్తానని, బాధగా అనిపిస్తే ఒంటరిగా బాత్రూంలోకి వెళ్లి ఏడుస్తానని ఓ పాడ్‌కాస్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు.
భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మైదానంలో ఎంతో కూల్‌గా కనిపించే ఈ ప్రొఫెషనల్ క్రికెటర్, తన బాధను, ఎమోషన్స్‌ను ఎలా కంట్రోల్ చేసుకుంటారో తాజాగా వివరించారు. ప్రముఖ యూట్యూబర్ రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె పలు విషయాలు వెల్లడించారు. తాను తీవ్రమైన ఒత్తిడి, బాధలో ఉన్నప్పుడు ఎవరికీ తెలియకుండా బాత్రూంలోకి వెళ్లి ఏడుస్తానని చెప్పారు. తనను చూసి ఎవరైనా జాలిపడితే అస్సలు భరించలేనని స్పష్టం చేశారు.














