Last Updated:
నాగ చైతన్య భార్య, నటి శోభిత దూళిపాళ్ల తాజాగా గద్వాల్ చీరలో తళుక్కుమంది. చేనేతకు అండగా నిలుస్తూ ఆమె షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అక్కినేని కోడలిగా, యువ సామ్రాట్ నాగచైతన్య భార్యగా టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువైన నటి శోభిత ధూళిపాళ. వివాహం తర్వాత కూడా తనదైన శైలిలో సెలెక్టివ్ కథలను ఎంచుకుంటూ నటనను కొనసాగిస్తున్న ఆమె, సోషల్ మీడియాలోనూ అత్యంత చురుగ్గా ఉంటున్నారు. తాజాగా ఆమె పంచుకున్న కొన్ని ఛాయాచిత్రాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కేవలం గ్లామర్ కోసమే కాకుండా ఒక సామాజిక బాధ్యతతో ఆమె చేసిన పోస్ట్ నెటిజన్ల, అక్కినేని అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మూలాలున్న శోభిత, విశాఖపట్నంలో పుట్టి పెరిగారు. తండ్రి నేవీ ఇంజనీర్ కాగా, తల్లి ఉపాధ్యాయురాలు. విద్యాభ్యాసం పూర్తయ్యాక మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, 2013లో ‘ఫెమినా మిస్ ఇండియా ఎర్త్’ కిరీటాన్ని దక్కించుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం ‘రామన్ రాఘవన్ 2.0’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తెలుగులో అడివి శేష్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ ‘గూఢచారి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసిన శోభిత.. ఆ తర్వాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు.
చైతూ ‘బుజ్జితల్లి’.. అక్కినేని నాగచైతన్య జీవితంలోకి ప్రవేశించిన తర్వాత శోభిత పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. సమంతతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న చైతూ, శోభితల మధ్య ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో ఆమెను చైతూ ముద్దుగా ‘బుజ్జితల్లి’ అని పిలుచుకుంటారు. పెద్దల అంగీకారంతో 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ప్రస్తుతం హనీమూన్ ముగించుకున్న ఈ జంట తిరిగి తమ వృత్తిగత జీవితాల్లో బిజీ అయ్యారు. ఇక వీరు ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని అక్కినేని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా శోభిత భారతీయ చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను చాటిచెబుతూ ప్రత్యేక ఫోటోషూట్ చేశారు. తెలంగాణకే తలమానికమైన ప్రసిద్ధ ‘గద్వాల్ చీర’ను ధరించి రాయల్ లుక్‌లో అద్భుతంగా మెరిసిపోయారు. మన దేశ చేనేత కార్మికుల నైపుణ్యాన్ని, హస్తకళాకారుల కళాసౌందర్యాన్ని ప్రశంసించిన ఆమె.. స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించాలని నెటిజన్లకు పిలుపునిచ్చారు. “మనం చేనేత వస్త్రాల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి నేరుగా ఆ నేత కార్మికులకే వెళ్తుంది, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది” అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. భారతీయ వస్త్ర వారసత్వాన్ని తన స్టైల్ ద్వారా హైలైట్ చేస్తూ శోభిత చూపిస్తున్న చొరవ పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













