Spider Man: బాక్సాఫీస్ దగ్గర ‘స్పైడర్ మ్యాన్’ అల్లకల్లోలం.. ఆ కలెక్షన్లేంట్రా బాబూ.. 3 రోజుల్లోనే చరిత్ర తిరగరాస్తుందిగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. టామ్ హోలాండ్ ప్రధాన పాత్రలో నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది.

News18
News18

హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. టామ్ హోలాండ్ ప్రధాన పాత్రలో నటించిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు నమోదు చేస్తూ ఈ సినిమా ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. మాస్ యాక్షన్, ఎమోషనల్ స్టోరీ, విజువల్ ఎఫెక్ట్స్, టామ్ హోలాండ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇండియాలో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ అంచనాలకు మించి ప్రదర్శన ఇస్తుంది. తొలి మూడు రోజుల్లోనే రూ. 180.20 కోట్ల నెట్, రూ. 215.48 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి హాలీవుడ్ సినిమాల్లో కొత్త రికార్డులు నమోదు చేసింది. తొలి రోజు గురువారం భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, శుక్రవారం స్వల్పంగా తగ్గినప్పటికీ శనివారం మళ్లీ అద్భుతంగా పుంజుకుంది. ఒక్క శనివారం రోజే రూ. 70.25 కోట్ల నెట్, రూ. 84.01 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

ఈ వసూళ్లతో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రికార్డులు కూడా బద్దలయ్యాయి. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ తొలి మూడు రోజుల్లో రూ. 161 కోట్ల నెట్ వసూలు చేయగా, సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ రూ. 144 కోట్ల నెట్ మాత్రమే సాధించింది. అయితే ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఈ రెండు చిత్రాల రికార్డులను సునాయాసంగా అధిగమించింది. అంతేకాకుండా, హాలీవుడ్ చిత్రాల్లో ఇప్పటివరకు తొలి రోజు అత్యధిక వసూళ్ల రికార్డు కలిగిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రికార్డును కూడా ఈ సినిమా వెనక్కి నెట్టడం విశేషంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 5,725 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఓవర్సీస్ మార్కెట్ల నుంచే దాదాపు రూ. 2,900 కోట్ల వసూళ్లు రావడం విశేషం. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలతో పాటు ఆసియా మార్కెట్లలో కూడా ఈ చిత్రం భారీ స్పందనను సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో హౌస్‌ఫుల్ షోలతో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ నమోదవుతోంది.

డెస్టిన్ డానియల్ క్రెట్టన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో టామ్ హోలాండ్‌తో పాటు జెండయా, సేడీ సింక్, జాన్ బెర్న్థల్, మార్క్ రఫలో తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’ తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ కథ, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్, భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విమర్శకుల ప్రశంసలతో పాటు అభిమానుల నుంచి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీకెండ్ ముగిసే సమయానికి వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ దూసుకుపోతున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఈ ఏడాది అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచే దిశగా అడుగులు వేస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports