Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. ‘ది రాజాసాబ్’ నిర్మాతలకు ఈ సారైనా కలిసొస్తుందా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా ఫ్యాన్స్ ఆశలన్నీ ‘స్పిరిట్’ సినిమాపైనే. మాములుగానే సందీప్ రెడ్డి సినిమాలు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రభాస్‌తో సినిమా అనే సరికి యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఈ సినిమా కోసం తెగ వేయిట్ చేస్తున్నారు.

News18
News18

ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా ఫ్యాన్స్ ఆశలన్నీ ‘స్పిరిట్’ సినిమాపైనే. మాములుగానే సందీప్ రెడ్డి సినిమాలు పిచ్చ క్రేజ్ ఉంటుంది. అలాంటిది ప్రభాస్‌తో సినిమా అనే సరికి యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఈ సినిమా కోసం తెగ వేయిట్ చేస్తున్నారు. అందులోనూ ఇప్పటి వరకు ప్రభాస్ నటించిన పాతిక సినిమాల్లో ఒక్కసారి కూడా ఖాకీ డ్రెస్ వేయలేదు. అలాంటిది సందీప్ ఇప్పుడు డార్లింగ్‌తో రూత్ లెస్ పోలీస్ క్యారెక్టర్ చేయిస్తున్నాడు.

ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ఆడియో గ్లింప్స్, పోస్టర్‌ గట్రా మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. మరీ మఖ్యంగా ఆడియో గ్లింప్స్‌లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని సందీప్ రెడ్డి వంగా చూపించడం బాలీవుడ్‌కు అస్సలు మింగుడు పడలేదు. ఇక న్యూఇయర్‌కు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మొత్తం దేశంలోనే సంచలనం సృష్టించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ గురించి స్పెషల్ అప్‌డేట్ ఇచ్చారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైనమెంట్స్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ‘స్పిరిట్’ సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేయనున్నారు.

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజై ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన ‘ది రాజా సాబ్’ సినిమాను నిర్మించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థనే. ఈ సంస్థకు ఈ ఒక్క సినిమానే దాదాపు రూ.200 కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. అంతకు ముందు ‘ఆదిపురుష్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది కూడా పీపుల్ మీడియా బ్యానరే. ఈ రెండు సినిమాలు పీపుల్ మీడియా సంస్థకు భారీ నష్టాలు మిగిల్చాయి. ఇప్పుడు స్పిరిట్ సినిమా మంచి హిట్టయితే ఆ భారం కాస్తయినా తగ్గుతుంది.

ఇక రిలీజ్‌కు ఇంకా 7 నెలలకు పైగానే ఉన్నా.. ఇప్పటికే చాలా సంస్థలు ‘స్పిరిట్’ రైట్స్‌ను లాక్ చేసుకుంటున్నాయి. నిజానికి ఈ సినిమాకు ఉన్న హైప్‌కు ఎన్ని కోట్లైనా పెట్టి రైట్స్ కొనుక్కోవడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమాను టీ సిరీస్‌ సంస్థలో కలిసి భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా అన్న ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దాదాపు రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.

త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబేరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఆయన లుక్‌కు మాములు రెస్పాన్స్ రాలేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు మ్యూజిక అందించిన హర్షవర్దన్ రామేశ్వరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *