Last Updated:
Viral News: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద పెరిగిపోయిందని వాటి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రతిపక్ష నాయకుడు కుక్క వేషంలో ఉన్న ఒక యువకుడితో కలెక్టర్ ఆఫీస్‌కి వచ్చారు. ప్రభుత్వం వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు రూ. 40 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేదని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
Stray Dogs Menace: ప్రతీచోట కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. వీధి కుక్కల వల్ల ప్రజలు పడుతున్న బాధలు, అవస్థలను ఎన్ని సార్లు ప్రభుత్వం, పాలకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి ప్రయోజనం ఉండటం లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా మున్సిపల్ కార్పొరేషన్లో వీధి కుక్కల వల్ల పడుతున్న ఇబ్బందులు తెలియజేయాలని అక్కడి ప్రతిపక్షనాయకుడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమావేశానికి ఒక కుక్క వేషం వేయించిన మనిషిని తీసుకెళ్లి తమ వినూత్న రీతిలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. అటుపై అదనపు కలెక్టర్‌కి వినతిపత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం ఈవార్త వైరల్ అవుతోంది.













