Last Updated:
హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌కి ఎప్పుడైనా వెళ్లారా? ఇలాంటి కార్లను మీరెప్పుడూ చూసి ఉండరు. ఫిదా అవ్వాల్సిందే.
హైదరాబాద్ నగరంలో ఉన్న ఆ మ్యూజియం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పాత ఇనుప సామాన్లతో అద్భుతమైన వాహనాలు సృష్టించవచ్చు అని సుధాకర్ (62) నిరూపిస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఈయన తన సృజనాత్మకతతో వింతైన కార్లను తయారు చేస్తూ సుధాకార్స్ మ్యూజియంను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వాడి పడేసిన పాత వస్తువులను ఉపయోగించి ఆయన ఏకంగా 350కి పైగా సైకిళ్లు, మోటార్ సైకిళ్లు, కార్లను అద్భుతంగా తీర్చిదిద్దారు.













