Suriya-Jyothika: నా భార్య జ్యోతిక ఎలాంటిదంటే..! సూర్య ఎమోషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

కరుప్పు సినిమా విడుదల సమయంలో తాను ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, ఆ క్లిష్ట పరిస్థితిలో తన భార్య జ్యోతిక (Jyotika) నుంచి అందిన సపోర్ట్‌ని, సూర్య తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

News18
News18

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), త్రిష (Trisha) జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘కరుప్పు’. ఆర్.జే. బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను సాధించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల సమయంలో తాను ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, ఆ క్లిష్ట పరిస్థితిలో తన భార్య జ్యోతిక (Jyotika) నుంచి అందిన సపోర్ట్‌ని, సూర్య తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సూర్య మాట్లాడుతూ.. “‘కరుప్పు’ సినిమా విడుదలకు ముందు సరిగ్గా చివరి నిమిషంలో ఊహించని విధంగా డిస్ట్రిబ్యూషన్, ఆర్థికపరమైన సమస్యలు తలెత్తాయి. ఆ పరిస్థితిలో సినిమాను థియేటర్లలో ప్రదర్శించాలంటే అదనంగా అప్పులు చేయక తప్పలేదు. అది నా కెరీర్‌కే కాకుండా మా కుటుంబానికి కూడా చాలా పెద్ద రిస్క్. కానీ, ఆ సమయంలో జ్యోతిక నాపై ఉంచిన అపారమైన నమ్మకమే నన్ను ధైర్యంగా ముందుకు నడిపించింది. ఎంతటి రిస్క్ అయినా తీసుకుందాం అని ఆమె నాకు కొండంత అండగా నిలిచింది” అని సూర్య భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

ప్రశంసలు నాకొద్దు.. జ్యోతిక:

సూర్య చేసిన వ్యాఖ్యలపై అదే ఇంటర్వ్యూలో జ్యోతిక కూడా స్పందించారు. “ఈ సినిమా విషయంలో పూర్తి ఘనత సూర్యకే దక్కుతుంది. నేను ఈ ప్రశంసలను స్వీకరించను. ఎందుకంటే మేము ఏ నిర్ణయమైనా కలిసి కూర్చుని తీసుకుంటాం. సినిమా నిర్మాణపరమైన నిర్ణయాలైనా, పిల్లల పెంపకమైనా మేమిద్దరం ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాం. ముందుగా ఒకరికొకరం చర్చించుకున్న తర్వాతే పిల్లలకు కూడా ఆ విషయాలను వివరిస్తాం” అని ఆమె బదులిచ్చారు. సూర్య-జ్యోతికల మధ్య ఉన్న అవగాహనకు ఈ మాటలు అద్దం పడుతున్నాయి.

ఇక సినిమా గురించి చెబుతూ.. దర్శకుడు ఆర్.జే. బాలాజీ ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడ్డారని సూర్య తెలిపారు. ఈ భారీ విజయం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని, ఈ ప్రయాణంలో ఫైనాన్షియర్లు కూడా ఎంతో సహకరించారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ, ఆర్థికపరమైన అడ్డంకుల వల్ల రిలీజ్ ఒకరోజు ఆలస్యమైంది. అప్పుడు సూర్య స్వయంగా రంగంలోకి దిగి భారీ స్థాయిలో నిధులు సర్దుబాటు చేసి, సినిమా విడుదలకు మార్గం సుగమం చేశారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూర్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports