మాములుగా ఇద్దరు స్టార్ హీరోలను ఒకే సినిమా కోసం ఒప్పించడం కత్తి మీద సాము. అందులోనూ కంప్లీట్ ఫ్యామిలీ కథను ఒప్పించడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఒప్పించి.. వాళ్లతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టించాడు శ్రీకాంత్ అడ్డాలి. అసలు ఈ జనరేషన్లో మల్టీస్టారర్ సినిమాలకు అద్దం పట్టిన మూవీ ఇది. నిజానికి.. ఈ మధ్య కాలంలో మాస్ ఫైట్స్, ఎలివేషన్ సీన్లు, ఐటెం పాటలు, ఒక గుద్దుతో విలన్ గాల్లో ఎగరడాలు, ముద్దు సీన్లు గట్రా లేకుండా ఒక క్లీన్ కాన్సెప్ట్‌తో సినిమా తీసి రికార్డులు బద్దలు కొట్టడం మాములు విషయం కాదు.













