Tehran: అమెరికాకు అణుబాంబు దాడి తప్ప మరో ఆప్షన్ లేదు: టెహ్రాన్ డిప్యూటీ మేయర్ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews

Tehran: అమెరికాకు అణుబాంబు దాడి తప్ప మరో ఆప్షన్ లేదు: టెహ్రాన్ డిప్యూటీ మేయర్ సంచలన వ్యాఖ్యలు |

టెహ్రాన్ పీఆర్, అంతర్జాతీయ సంబంధాల కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ఘోలామ్‌జాదేహ్.. తమ దేశంపై మళ్లీ దాడి జరిగినా శత్రువులపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. “ఇప్పుడు అమెరికన్లు మాపై ఉపయోగించగల ఏకైక ఆప్షన్ అణు బాంబు దాడే. అంతకు మించి వారు ఏమీ చేయలేరు. అయినా సరే మేము పోరాడుతాము” అని ఆయన ‘ఇండియా టుడే’తో పేర్కొన్నారు.

దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు అంతరాయం కలిగించాలని అమెరికా, ఇజ్రాయెల్‌లు భావించాయని, అయితే అక్కడ ప్రజల భారీ భాగస్వామ్యాన్ని, అంతర్జాతీయ అతిథుల హాజరును చూసి వారు వెనక్కి తగ్గారని ఆయన ఆరోపించారు. కాగా, టెహ్రాన్ మరియు వాషింగ్టన్ల మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఘోలామ్‌జాదేహ్ స్పష్టం చేశారు. “చర్చలు ముందుకు సాగడం లేదు. ఈ విషయం మాకూ తెలుసు, అమెరికాకూ తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ట్రంప్ తాజా హెచ్చరిక.. ఇరాన్ కౌంటర్

రాజకీయ చర్చలు విఫలమైతే సైనిక శక్తిని ఉపయోగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని వైట్ హౌస్ వేదికగా ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. “మేము ఇరాన్‌తో ఒక ఒప్పందాన్ని అయినా చేసుకుంటాం, లేదా ఆ పనిని పూర్తిగా ముగిస్తాం (ఫినిష్ ద జాబ్). ఆ పనిని ముగించడం మాకు పెద్ద కష్టమేమీ కాదు” అని ట్రంప్ పేర్కొన్నారు. శాంతి ప్రయత్నాలు విఫలమైతే ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలపై దాడి చేసే సామర్థ్యం అమెరికాకు ఉందని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బాగెర్ జోల్గాద్ తీవ్రంగా మండిపడ్డారు. ఇరాన్ ప్రజలతో “గౌరవంగా” మాట్లాడాలని, లేకపోతే “మరో భాషలో” సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. “ఈ రోజు 9.1 కోట్ల మంది ఇరానియన్లను బెదిరించిన అమెరికా భ్రమల అధ్యక్షుడికి నేను ఒకటే చెబుతున్నాను: ఇరాన్ ప్రజలతో గౌరవంగా మాట్లాడండి, లేదంటే మేము మీకు మరో భాషలో సమాధానం ఇస్తాము” అని జోల్గాద్ స్పష్టం చేశారు.

ఇరాన్‌పై సైనిక చర్యకు దిగితే యుద్ధాన్ని పూర్తిగా ముగిస్తామంటూ (ఫినిష్ ద జాబ్) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉపయోగించడానికి అమెరికా వద్ద సంప్రదాయ సైనిక ఎంపికలన్నీ అయిపోయాయని, ఇప్పుడు వారి వద్ద కేవలం ‘అణుబాంబు’ దాడి ఆప్షన్ మాత్రమే మిగిలి ఉందని టెహ్రాన్ డిప్యూటీ మేయర్ హమీద్రేజా ఘోలామ్‌జాదేహ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టెహ్రాన్ పీఆర్ మరియు అంతర్జాతీయ సంబంధాల కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న ఘోలామ్‌జాదేహ్.. తమ దేశంపై మళ్లీ దాడి జరిగినా శత్రువులపై పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. “ఇప్పుడు అమెరికన్లు మాపై ఉపయోగించగల ఏకైక ఆప్షన్ అణు బాంబు దాడే. అంతకు మించి వారు ఏమీ చేయలేరు. అయినా సరే మేము పోరాడుతాము” అని ఆయన ‘ఇండియా టుడే’తో పేర్కొన్నారు.

దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు అంతరాయం కలిగించాలని అమెరికా, ఇజ్రాయెల్‌లు భావించాయని, అయితే అక్కడ ప్రజల భారీ భాగస్వామ్యాన్ని, అంతర్జాతీయ అతిథుల హాజరును చూసి వారు వెనక్కి తగ్గారని ఆయన ఆరోపించారు. కాగా, టెహ్రాన్ మరియు వాషింగ్టన్ల మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో ఎలాంటి పురోగతి లేదని ఘోలామ్‌జాదేహ్ స్పష్టం చేశారు. “చర్చలు ముందుకు సాగడం లేదు. ఈ విషయం మాకూ తెలుసు, అమెరికాకూ తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ట్రంప్ తాజా హెచ్చరిక.. ఇరాన్ కౌంటర్

రాజకీయ చర్చలు విఫలమైతే సైనిక శక్తిని ఉపయోగించడానికి అమెరికా సిద్ధంగా ఉందని వైట్ హౌస్ వేదికగా ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. “మేము ఇరాన్‌తో ఒక ఒప్పందాన్ని అయినా చేసుకుంటాం, లేదా ఆ పనిని పూర్తిగా ముగిస్తాం (ఫినిష్ ద జాబ్). ఆ పనిని ముగించడం మాకు పెద్ద కష్టమేమీ కాదు” అని ట్రంప్ పేర్కొన్నారు. శాంతి ప్రయత్నాలు విఫలమైతే ఇరాన్ కీలక మౌలిక సదుపాయాలపై దాడి చేసే సామర్థ్యం అమెరికాకు ఉందని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మహ్మద్ బాగెర్ జోల్గాద్ తీవ్రంగా మండిపడ్డారు. ఇరాన్ ప్రజలతో “గౌరవంగా” మాట్లాడాలని, లేకపోతే “మరో భాషలో” సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. “ఈ రోజు 9.1 కోట్ల మంది ఇరానియన్లను బెదిరించిన అమెరికా భ్రమల అధ్యక్షుడికి నేను ఒకటే చెబుతున్నాను: ఇరాన్ ప్రజలతో గౌరవంగా మాట్లాడండి, లేదంటే మేము మీకు మరో భాషలో సమాధానం ఇస్తాము” అని జోల్గాద్ స్పష్టం చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports