ఒక్క మెసేజ్ చేయండి చాలు.. తనకు కాబోయే వాడి గురించి చెబుతూ.. “ఈ భూమి మీద ఎవరూ పర్ఫెక్ట్ కాదు, నేను కూడా. కానీ, నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి, అర్థం చేసుకునే మంచి అబ్బాయి కావాలి. పెళ్లయ్యాక భర్తను ‘ఏమండీ’ అని గౌరవంగా పిలవడం నాకు రాదు, స్నేహితుడిలానే ఉంటాను. ఎవరైనా నిజాయితీగా ఉండి, నన్ను బాగా చూసుకునే వారైతే.. నాకు ఇన్స్టాగ్రామ్లో నేరుగా మెసేజ్ చేయవచ్చు. నాకు నచ్చితే కచ్చితంగా రిప్లై ఇస్తాను” అని రేఖ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. టీనేజ్ ప్రేమకు, మెచ్యూరిటీ వచ్చాక పుట్టే ప్రేమకు చాలా తేడా ఉంటుందని, ప్రేమలో ప్యూరిటీ ఉండాలని ఆమె స్పష్టం చేశారు.













