Last Updated:
ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించేందుకు గాను, రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్) , అలైటింగ్ (బస్ దిగే పాయింట్ ) పాయింట్లను భారీగా పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.
TGSRTC: బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంపొందించేందుకు గాను, రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సులకు బోర్డింగ్ (బస్ ఎక్కే పాయింట్) , అలైటింగ్ (బస్ దిగే పాయింట్ ) పాయింట్లను భారీగా పెంచినట్లు టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రయాణికులు తమకు నచ్చిన, దగ్గర్లోని ప్రాంతాల నుంచే సులభంగా బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా రూట్లను కింది విధంగా క్రమబద్ధీకరించారు.














