నిజానికి ఈ సినిమాపై ముందు నుంచి ఓవర్ హైప్ ఉండటం వల్ల.. ఏదో ఎక్స్‌పెక్ట్ చేసిన సినీ లవర్స్‌కు కాస్త డిజప్పాయింట్‌మెంట్ అనిపించింది. అసలు ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్లిన వాళ్లు మాత్రం సినమా చూసి ఫుల్ సాటిస్‌ఫై అయ్యారు. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమా చూసిన వాళ్లందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మర ముఖ్యంగా ఫస్ట్ 20 నిమిషాలు, శికాంజ మాలిక్ ఇంట్రో, నాని ఎంట్రీ, ఫైట్స్, ఇంటర్వెల్.. ఇలా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హై నోట్‌లో వెళ్లిపోయింది. సెకండ్ హాఫ్ కూడా అదే రేంజ్‌లో ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని అందరూ ఫిక్సయ్యారు. కట్ చేస్తే, సెకండ్ హాఫ్ ఫస్ట్ 10 నిమిషాలు బాగానే అనిపించినా.. ఆ తర్వాత మాత్రం కథ దారి తప్పింది. ఎడిటింగ్‌లో చాలా సీన్లు లేపేయాల్సింది అనిపించింది.














