ముఖ్యంగా విలన్ ‘షికంజా మాలిక్’ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటన, ఆయనతో నాని తలపడే ఎలివేషన్ సీన్స్ సినిమాకు ప్రధాన బలం కానున్నాయని తెలుస్తోంది. ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్, ‘ఏష నాగుల’ పాట ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని టాక్. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి, బాబు మోహన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంపూర్ణేష్ బాబులోని సరికొత్త నటుడిని ‘బిర్యాని’ పాత్రలో చూడొచ్చని అంటున్నారు.














