ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ సినిమా కేవలం ఓ సాధారణ యాక్షన్ కథ కాదని, ఓ ప్రత్యేకమైన సంచార జాతి జీవితం, వాళ్ల అస్తిత్వం, గుర్తింపు కోసం సాగిన పోరాటం చుట్టూ కథ నడుస్తుందని తెలుస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు రాజస్థాన్ నుంచి వలస వచ్చిన ‘షికారి’ అనే సంచార జాతి తెలంగాణ ప్రాంతంలో స్థిరపడినట్లు సమాచారం. అప్పట్లో ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండేది. వేట, దొంగతనాలు వంటి వాటినే జీవనాధారంగా చేసుకుని ఈ సమాజానికి చెందిన కుటుంబాలు జీవించేవారని చెబుతారు. మరోవైపు హిందూ సంప్రదాయాలను పాటిస్తూ దేవుళ్లను ఆరాధించడం కూడా వాళ్ల జీవన విధానంలో భాగంగా ఉండేదని సమాచారం.














