డ్యాన్స్‌తో పాటు నటనలోనూ రాఘవ్ తన సత్తా చూపించారు. ‘సోనాలి కేబుల్’, ‘ఏబీసీడీ 2’, ‘అభయ్’, ‘కిల్’, ‘యుద్ర’ వంటి సినిమాలు, వెబ్ ప్రాజెక్టుల్లో నటించారు. నటనలో మరింత పట్టు కోసం యాక్టింగ్ కోచ్ సౌరభ్ సచ్‌దేవా వద్ద శిక్షణ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లో మాత్రం రాఘవ్ జుయల్ పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. విక్రమ్ మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్రలో ఆయన నటించారు. ఇప్పటివరకు డ్యాన్సర్, హోస్ట్‌గా కనిపించిన రాఘవ్.. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.














